
Relationship between Kalyan Ram wife and Shatamanam Bhavati movie
Kalyan Ram Wife : నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తాజాగా తన కెరీర్ లోనే బింబిసారతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కల్యాణ్ రామ్ కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం సోసియో ఫాంటసీ, టైం ట్రావెల్ కథాంశంతో తెరకెక్కింది. సంయుక్త మీనన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ తెరకెక్కించాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ తన బావమరిది హరికృష్ణతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాడు. మొదటి నుంచి ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్ వంటివి సినిమాపై పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేశాయి. ఇక ఈ నెల 5న రిలీజ్ కాగా మంచి టాక్ సొంతం చేసుకుంది.. ఇప్పటికే బ్రేక్ ఇవెన్ సాధించి లాభాల బాటలో దూసుకెళ్తోంది. పటాస్ సినిమా తర్వాత కల్యాణ్ రామ్‌కు మళ్లీ ఆ స్థాయిలో సూపర్ హిట్ సినిమా బింబిసారతోనే దక్కింది.
అయితే కల్యాణ్ రామ్ కెరీర్ ఆరంభం నుంచి చూస్తే ఎక్కువగా మాస్ మసాలా యాక్షన్ సినిమాలలో నటించాడు. అయితే 118, బింబిసారా లాంటి వైవిద్యమైన కథలను ఎంచుకున్న కల్యాణ్ రామ్ సూపర్ హిట్ కొట్టడంతో ఇప్పుడు ఆలోచన దృక్పథంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. కొత్త దర్శకులు కొత్త కథల వైపు దృష్టిసారిస్తున్నాడు. అయితే బింబిసారా విజయం తర్వాత కల్యాణ్ రామ్ భార్య స్వాతి గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతోంది. స్వాతి ధనిక కుటుంబం నుంచి నందమూరి కుటుంబంలోకి కోడలుగా అడుగుపెట్టింది. స్వాతి పేరెంట్స్ కు ఫార్మా రంగంలో చాలా కంపెనీలు ఉన్నాయి. అంతేకాకుండా స్వాతి సోదరుడు హరి కల్యాణ్ రామ్‌కు సినిమాలపరంగా ఎప్పుడు అండగా ఉంటూ వస్తున్నారు. తాజాగా బింబిసారా సినిమాకు కూడా హరి నిర్మాతగా నిర్మించారు.
Relationship between Kalyan Ram wife and Shatamanam Bhavati movie
అయితే కల్యాణ్ రామ్ నటించిన ఇజం సినిమాలో కళ్యాణ్ రామ్ ఆ పాత్రకు తగినట్టుగా బరువు తగ్గటంలో ఆమె కీలక పాత్ర పోషించిందట. ఈ విషయాన్ని కల్యాణ్ రామ్ స్వయంగా చెప్పారు. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ ఎంత స్టైలిష్ గా కనిపించడం వెనుక తన భార్య కృషి ఉందని కల్యాణ్ రామ్ తెలిపాడు. ప్రతిరోజు కల్యాణ్ రామ్ డైట్ పర్ఫెక్ట్ గా మెయింటెన్ చేయడంలో ఆమె కీలకంగా వ్యవహరించేదట. తాను డైట్ ఫాలో అవ్వకుండా ఉందామనుకున్నా స్వాతి మాత్రం ఊరుకునేదికాదట. కచ్చితంగా డైట్ ఫాలో అయ్యేలా చేసిందని కల్యాణ్ రామ్ తెలిపారు. అలాగే శర్వానంద్ హీరోగా వచ్చిన శతమానం భవతి సినిమా చూసిన స్వాతి.. తనను కూడా ఇలాంటి కుటుంబ కథా సినిమాలు చేయాలని.. పంచ్ డైలాగ్ లు.. ఫైట్లు చేయడం వద్దని చెప్పిందట. కథ చాలా సింపుల్‌గా, ఫ్యామిలీని మెప్పించేలా ఉండాలని.. హింస తగ్గించుకోవాలని సూచనలు చేసిందట.
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.