Home » Entertainment » Renu Desai Emotional Post On Social Media
Entertainment

Renu Desai : రేణూ దేశాయ్ ఏంటి ‘ ఆ టైపు ‘ పోస్ట్ పెట్టింది .. ఏదో తేడాగా ఉందే… వీడియో

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: April 6, 2023 5:36 pm
Advertisement

Renu Desai : టాలీవుడ్ లో బద్రి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్ ఆ ఒక్క సినిమాతో ఫుల్ పాపులర్ అయింది. ఈ సినిమా తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ తో కలిసి జాని సినిమాలో నటించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. దాని తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు దూరంగా ఉంటున్న రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు తన పిల్లల ఫోటోలను, తన హవా భావాలను వ్యక్తపరుస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఆమె పెట్టే పోస్ట్ లు అప్పుడప్పుడు చర్చకు దారి తీస్తుంటాయి. ఎవరినో ఉద్దేశించి

Advertisement

Renu Desai emotional post on social media

అంటున్నట్లుగా ఉంటాయి ఆమె కామెంట్స్. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ కూడా అలానే ఉండడంతో మరోసారి నేటిజన్లు ఈ పోస్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు. తనను వదిలి వెళ్ళిపోయిన వాళ్లను తలుచుకొని రేణు బాధపడుతున్నట్లుగా ఉంది ఆ సందేశం. మండుటెండలో చల్లని గాలిలా అనుకోకుండా కొందరు మన జీవితంలోకి వస్తారు. వారి చూపులు మీ హృదయాలతో మాట్లాడుతాయి. వారితో మీరు గడిపిన కొద్ది గంటలు జీవితాంతం గుర్తుండిపోతాయి. చెరగని ముద్ర వేస్తాయి. చాలా ఎడబాటు తీరనివేదనను మిగుల్చుతాయి. కొందరు మాత్రం బాధలు తొలగించి సంతోషాలని నింపుతారు అని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

Advertisement

ఈ క్రమంలో రేణు దేశాయ్ పెట్టిన పోస్ట్ చూసి ప్రతి ఒక్కరు చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. ఆమె ఎవరిని ఉద్దేశించి పెట్టిందో క్లారిటీ అయితే ఇవ్వలేదు కానీ ఆమె పెట్టిన పోస్ట్ చూసి అందరూ ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. కొందరేమో పవన్ కళ్యాణ్ గురించి ఆ పోస్ట్ పెట్టినట్లుగా మాట్లాడుకుంటున్నారు. మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్లకు అన్నా లెజ్నివా ను పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడిపోయారు. అందుకే రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ ని తలచుకొని ఇలా పోస్ట్ పెట్టింది అని జనాలు భావిస్తున్నారు.

Advertisement

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి