Renu Desai : స‌రికొత్త టాటూతో హాట్ టాపిక్‌గా మారిన రేణూ దేశాయ్.. ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తుందా ఏంటి.. ? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Renu Desai : స‌రికొత్త టాటూతో హాట్ టాపిక్‌గా మారిన రేణూ దేశాయ్.. ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తుందా ఏంటి.. ?

Renu Desai : కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా, ద‌ర్శ‌కురాలిగా, న‌టిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది రేణూ దేశాయ్. బ‌ద్రి సినిమా స‌మ‌యంలో ప‌వ‌న్‌తో ప్రేమ‌లో ప‌డ్డ ఈమె కొన్నాళ్ల‌పాటు ప‌వ‌న్‌తో డేటింగ్‌లో ఉండి ఆ త‌ర్వాత పెళ్లి చేసుకొని ఇద్ద‌రు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తరువాత రేణు దేశాయ్‌ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంది. […]

 Authored By ramu | The Telugu News | Updated on :15 April 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Renu Desai : స‌రికొత్త టాటూతో హాట్ టాపిక్‌గా మారిన రేణూ దేశాయ్.. ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తుందా ఏంటి.. ?

Renu Desai : కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా, ద‌ర్శ‌కురాలిగా, న‌టిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది రేణూ దేశాయ్. బ‌ద్రి సినిమా స‌మ‌యంలో ప‌వ‌న్‌తో ప్రేమ‌లో ప‌డ్డ ఈమె కొన్నాళ్ల‌పాటు ప‌వ‌న్‌తో డేటింగ్‌లో ఉండి ఆ త‌ర్వాత పెళ్లి చేసుకొని ఇద్ద‌రు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తరువాత రేణు దేశాయ్‌ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంది. తాజాగా రేణూ దేశాయ్ త‌న చేతిపై వేయించుకున్న టాటూ పిక్ షేర్ చేసింది. దీనికి క్యాప్ష‌న్‌గా మాటల కంటే ఫోటోలే ఎక్కువగా మాట్లాడుతుంటాయ్ అని రాసుకొచ్చింది. మౌనం పరం శీలం అంటూ టాటూని వేయించుకుంది.

Renu Desai : రేణూ పోస్ట్ అర్ధ‌మేంటి?

అయితే టాటూలో బీజేపీ సింబల్ అయిన కమలం పువ్వు క‌నిపించ‌డంతో అంద‌రిలో కొత్త అనుమానాలు మొద‌ల‌య్చాయి. క‌మ‌లం గుర్తు వేయించుకుంది అంటే ఆమె బీజేపీకే మద్దతు ఇస్తున్నట్టుగా చెప్పకనే చెప్పేసిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ పోస్ట్ చూసి జన సైనికులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సైతం ఫుల్ ఖుషీ అవుతున్నారు. రానున్న ఎన్నిక‌ల‌లో మోడీ, బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నాను, ఏపీలో కూటమికే సపోర్ట్ ఇస్తున్నానని మాత్రం రేణూ దేశాయ్ ఎక్కడా క్లియర్‌గా చెప్పలేదు కాని జ‌నాలు మాత్రం ఆమె స‌పోర్ట్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కే అన్న‌ట్టుగా ఇలా హింట్ ఇచ్చింద‌ని చెబుతున్నారు.

Renu Desai స‌రికొత్త టాటూతో హాట్ టాపిక్‌గా మారిన రేణూ దేశాయ్ ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తుందా ఏంటి

Renu Desai : స‌రికొత్త టాటూతో హాట్ టాపిక్‌గా మారిన రేణూ దేశాయ్.. ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తుందా ఏంటి.. ?

ఇక రేణూ దేశాయ్ ఇటీవ‌ల బుల్లితెర‌, వెండితెర‌పై పెద్ద‌గా సంద‌డి చేసింది లేదు. ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్‌ను రవితేజ హీరోగా తాజాగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో స్టార్ట్ చేసింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టింది. ప్ర‌స్తుతం మాత్రం సినిమాల జోలికి అయితే పోవ‌డం లేదు కాని సోష‌ల్ మీడియాలో మాత్రం ఆస‌క్తిక‌ర పోస్ట్‌లు పెడుతూ వార్త‌లలో నిలుస్తుంది. సుమారు రెండు దశాబ్దాల తర్వాత టైగర్‌ నాగేశ్వర రావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన రేణూ ఆ చిత్రంలో హేమలతా లవణం పాత్ర పోషించి ప్రశంసలు అందుకుంది. దీని తర్వాత రేణూ దేశాయ్‌ మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుందనుకున్నారు చాలామంది. కాని అలాంటిది ఏమి జ‌ర‌గలేదు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది