Renu Desai Wants A Person In Social Media Post Viral
Renu Desai : టాలీవుడ్‌లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ మూడు పెళ్లిళ్లలో రేణూ దేశాయ్ పెళ్లి గురించి మాత్రమే హాట్ టాపిక్ అవుతుంటుంది. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకి చాలా దగ్గరగా ఉంటున్న విషయం తెలిసిందే. పవన్ నుండి విడిపోయిన తర్వాత రేణూ తన పిల్లల బాగోగులు చూసుకుంటూ కాలం గడిపేస్తుంది. అప్పుడప్పుడు వారి గురించే కాకుండా తన పర్సనల్ లైఫ్ గురించి కూడా కొన్ని విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే రేణూ బద్రి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు రేణు. జానీ తర్వాత ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు.
పవన్ కళ్యాన్‌తో పెళ్లి, పిల్లలు, ఆ తర్వాత విడుకులతో ఆమె కొన్నాళ్ల పాటు వెండి తెరకు దూరమయ్యారు. కొన్నేళ్ల నుంచి కూడా రేణు దేశాయ్ నటనకు దూరంగా ఉంటున్నారు. ఆ మధ్య కాలంలో రేణు ఓ సినిమాను డైరెక్ట్ చేశారు. కానీ యాక్టింగ్ మాత్రం చేయలేదు. అయితే ఇప్పుడు తాజాగా రేణు రీ ఎంట్రీకి రెడీ అయ్యారు. దర్శకురాలిగా, నటిగా, జడ్జిగా రేణూ అభిమానులని అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా రేణు దేశాయ్ ఇంస్టాగ్రామ్లో చేసిన పోస్ట్ లు ఆమె రెండవ వివాహం గురించి మరోసారి చర్చ జరిగేలా చేశాయి. ‘జీవితంలో అవసరం ఉన్నప్పుడు మన చేయి పట్టుకుని నడిపించే ఒక తోడు కావాలి’ అంటూ ఒక సరస్సు ఒడ్డున కూర్చుని ఉన్న వీడియో పోస్ట్ చేసింది. మరో పోస్ట్ లో.. మీ సోల్ మేట్ ని వెతకడానికి ముందు మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోండి’ అంటూ కామెంట్ పెట్టింది.
Renu Desai Wants A Person In Social Media Post Viral
తాజాగా ఆమె చేసిన కామెంట్స్ రెండో పెళ్లికి సంబంధించినవా అనే విషయంపై చర్చ నడుస్తుంది. ఆమె రెండవ వివాహం వైపు అడుగులు వేస్తోందా అనేది తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ సరసన రేణు దేశాయ్ తొలిసారి బద్రి చిత్రంలో నటించింది. అప్పుడే వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆ పరిచయం ప్రేమ పెళ్లిగా మారింది. అయితే చాలా ఏళ్ల పాటు తల్లిదండ్రుల వద్దే ఉన్న రేణు గత ఏడాది రెండో పెళ్ళికి రెడీ అవుతున్నట్టు వార్తలు వచ్చాయి. అతడితో ఎంగేజ్మెంట్ జరిగిన ఫోటోను కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనకు కాబోయే రెండో భర్త ఫేస్ ను దాచేసిన రేణు అతడి చేతికి ఉన్న రింగ్ ను చూపించేలా ఫోటో పెట్టింది. అయితే ఇప్పటికీ రేణు రెండో పెళ్లిపై క్లారిటీ లేదు.
రేణూ రెండో వివాహం చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చిన నేపధ్యంలో ఆమెని తెగ ఏకి పారేశారు. దీంతో రెండో పెళ్లికి సంబంధించి వార్తలకి చెక్ పడింది. గతేడాది సరదాగా ఆలీతో షో కి వచ్చిన రేణుదేశాయ్ తన రెండో భర్త గురించి కొన్ని విషయాలు మాత్రం చెప్పింది. అతడు ఓ ఐటీ కంపెనీ మేనేజర్‌గా పనిచేస్తూ ఉంటాడని… ముందు అతడు అమెరికాలో ఉద్యోగం చేసే అతడు వాళ్ళ తండ్రికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇండియాకు వచ్చి పూణేలో ఐటి ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పింది. తర్వాత అతని గురించి ఒక్క విషయం కూడా రివీల్ చేయలేదు. దీంతో రేణూ విషయంలో ఏం జరుగుతుందో ఎవరికి అర్ధం కావడం లేదు.
Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…
Gym : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
This website uses cookies.