Renu Desai : జీవితంలో తోడు కావాలి అంటూ రేణూ దేశాయ్ పోస్ట్.. రెండో పెళ్లికి సిద్ధ‌మైందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Renu Desai : జీవితంలో తోడు కావాలి అంటూ రేణూ దేశాయ్ పోస్ట్.. రెండో పెళ్లికి సిద్ధ‌మైందా?

Renu Desai : టాలీవుడ్‌లో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విష‌యం తెలిసిందే. ఆ మూడు పెళ్లిళ్ల‌లో రేణూ దేశాయ్ పెళ్లి గురించి మాత్ర‌మే హాట్ టాపిక్ అవుతుంటుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కి చాలా ద‌గ్గ‌రగా ఉంటున్న విష‌యం తెలిసిందే. ప‌వ‌న్ నుండి విడిపోయిన త‌ర్వాత రేణూ త‌న పిల్ల‌ల బాగోగులు చూసుకుంటూ కాలం గ‌డిపేస్తుంది. అప్పుడ‌ప్పుడు వారి గురించే […]

 Authored By sandeep | The Telugu News | Updated on :5 September 2022,2:30 pm

Renu Desai : టాలీవుడ్‌లో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విష‌యం తెలిసిందే. ఆ మూడు పెళ్లిళ్ల‌లో రేణూ దేశాయ్ పెళ్లి గురించి మాత్ర‌మే హాట్ టాపిక్ అవుతుంటుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కి చాలా ద‌గ్గ‌రగా ఉంటున్న విష‌యం తెలిసిందే. ప‌వ‌న్ నుండి విడిపోయిన త‌ర్వాత రేణూ త‌న పిల్ల‌ల బాగోగులు చూసుకుంటూ కాలం గ‌డిపేస్తుంది. అప్పుడ‌ప్పుడు వారి గురించే కాకుండా త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి కూడా కొన్ని విష‌యాలు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే రేణూ బద్రి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు రేణు. జానీ తర్వాత ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు.

Renu Desai : రేణూ పోస్ట్‌పై అనుమానాలు..

పవన్ కళ్యాన్‌తో పెళ్లి, పిల్లలు, ఆ తర్వాత విడుకులతో ఆమె కొన్నాళ్ల పాటు వెండి తెరకు దూరమయ్యారు. కొన్నేళ్ల నుంచి కూడా రేణు దేశాయ్ నటనకు దూరంగా ఉంటున్నారు. ఆ మ‌ధ్య కాలంలో రేణు ఓ సినిమాను డైరెక్ట్ చేశారు. కానీ యాక్టింగ్ మాత్రం చేయ‌లేదు. అయితే ఇప్పుడు తాజాగా రేణు రీ ఎంట్రీకి రెడీ అయ్యారు. ద‌ర్శ‌కురాలిగా, న‌టిగా, జ‌డ్జిగా రేణూ అభిమానుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మైంది. తాజాగా రేణు దేశాయ్ ఇంస్టాగ్రామ్లో చేసిన పోస్ట్ లు ఆమె రెండవ వివాహం గురించి మరోసారి చర్చ జరిగేలా చేశాయి. ‘జీవితంలో అవసరం ఉన్నప్పుడు మన చేయి పట్టుకుని నడిపించే ఒక తోడు కావాలి’ అంటూ ఒక సరస్సు ఒడ్డున కూర్చుని ఉన్న వీడియో పోస్ట్ చేసింది. మరో పోస్ట్ లో.. మీ సోల్ మేట్ ని వెతకడానికి ముందు మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోండి’ అంటూ కామెంట్ పెట్టింది.

Renu Desai Wants A Person In Social Media Post Viral

Renu Desai Wants A Person In Social Media Post Viral

తాజాగా ఆమె చేసిన కామెంట్స్ రెండో పెళ్లికి సంబంధించిన‌వా అనే విష‌యంపై చ‌ర్చ న‌డుస్తుంది. ఆమె రెండవ వివాహం వైపు అడుగులు వేస్తోందా అనేది తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ సరసన రేణు దేశాయ్ తొలిసారి బద్రి చిత్రంలో నటించింది. అప్పుడే వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ త‌ర్వాత ఆ ప‌రిచ‌యం ప్రేమ పెళ్లిగా మారింది. అయితే చాలా ఏళ్ల పాటు తల్లిదండ్రుల వద్దే ఉన్న రేణు గత ఏడాది రెండో పెళ్ళికి రెడీ అవుతున్నట్టు వార్తలు వచ్చాయి. అతడితో ఎంగేజ్మెంట్ జరిగిన ఫోటోను కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనకు కాబోయే రెండో భర్త ఫేస్ ను దాచేసిన రేణు అతడి చేతికి ఉన్న రింగ్ ను చూపించేలా ఫోటో పెట్టింది. అయితే ఇప్పటికీ రేణు రెండో పెళ్లిపై క్లారిటీ లేదు.

రేణూ రెండో వివాహం చేసుకోబోతున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చిన నేప‌ధ్యంలో ఆమెని తెగ ఏకి పారేశారు. దీంతో రెండో పెళ్లికి సంబంధించి వార్త‌ల‌కి చెక్ ప‌డింది. గ‌తేడాది సరదాగా ఆలీతో షో కి వచ్చిన రేణుదేశాయ్ తన రెండో భర్త గురించి కొన్ని విషయాలు మాత్రం చెప్పింది. అతడు ఓ ఐటీ కంపెనీ మేనేజర్‌గా పనిచేస్తూ ఉంటాడ‌ని… ముందు అత‌డు అమెరికాలో ఉద్యోగం చేసే అతడు వాళ్ళ తండ్రికి ఆరోగ్యం స‌రిగా లేకపోవడంతో ఇండియాకు వచ్చి పూణేలో ఐటి ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పింది. త‌ర్వాత అత‌ని గురించి ఒక్క విష‌యం కూడా రివీల్ చేయ‌లేదు. దీంతో రేణూ విష‌యంలో ఏం జ‌రుగుతుందో ఎవ‌రికి అర్ధం కావ‌డం లేదు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది