RGV Girl Fan : ఆర్జీవీని మించిపోయిందిరా అయ్యా.. అమ్మాయి అయి ఉండి ఆర్జీవీని చేసుకున్నావా అని అడగడానికి సిగ్గు లేదా? వీడియో

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 11 April 2023, 9:00 am

RGV Girl Fan : ఆర్జీవీ ఫ్యాన్ గర్ల్ తెలుసు కదా. ఆర్జీవీ డేంజరస్ సినిమా ప్రమోషన్స్ సమయంలో ఆర్జీవీ ఫ్యాన్ గర్ల్ ఆయనతో ఇంటర్వ్యూ తీసుకుంది. తన పేరు శివ పార్వతి. కానీ.. తనను ఎక్కువగా సిరి, శిరీష అని పిలుస్తారు. ఆర్జీవీ ఫ్యాన్ గర్ల్ సిరి అంటే చాలు.. తనకు సోషల్ మీడియాలో మామూలు క్రేజ్ లేదు. ఎప్పుడైతే తను ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసిందో అప్పటి నుంచి తన రేంజే మారిపోయింది. ఇప్పుడు సిరిని అందరూ ఇంటర్వ్యూ చేస్తున్నారు.

తనను ఇంటర్వ్యూ చేసే స్థాయికి వెళ్లింది. తాజాగా తను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీని ఆ పని చేస్తారా అని ఎలా అడిగావు అంటూ యాంకర్ అడగడంతో ఏం అలా అడగడంలో తప్పేంటి. మీరు చేసుకోరా? ఎవరైనా చేసుకుంటారు కదా. ప్రతి ఒక్క మగాడు చేసుకుంటాడు. దాంట్లో తప్పేముంది అని అంటుంది సిరి. దీంతో యాంకర్ బిత్తరపోతాడు. ఆర్జీవీని నేను అడగడంతో ఆయన చాలా పాజిటివ్ గా తీసుకున్నారు. నాకు హగ్ ఇచ్చి మరీ నేను చేసుకోను అని చెప్పారు. దాన్ని నేను కూడా పాజిటివ్ గా తీసుకున్నాను..

rgv girl fan interview video viral

rgv girl fan interview video vira

RGV Girl Fan : ఆర్జీవీ చాలా పాజిటివ్ గా తీసుకున్నారు

అంటుంది సిరి. ఆ తర్వాత సిరి తొడలను చూసి ఈ తొడలు నన్ను ఆలోచింపజేశాయి అని ఆర్జీవీ అనడంతో.. అదే ప్రశ్న మళ్లీ అడగడుతాడు యాంకర్. దీంతో నేను ఆయన నా తొడల గురించి మాట్లాడటాన్ని చాలా పాజిటివ్ గా తీసుకున్నాను. నిజానికి ఆర్జీవీ గారు బయట మాట్లాడే తీరు, ఓపెన్ గా మాట్లాడే తీరు కొంచెం వెరైటీగా అనిపించవచ్చు కానీ.. ఆయన్ను లైవ్ లో కలిస్తేనే తెలుస్తుంది.. అని సిరి ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసింది సిరి.

Also read

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp