రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎలా మాట్లాడతాడో ఎందుకు మాట్లాడతాడో కూడా తెలీదు. కానీ వర్మ ఓ ట్వీట్ వేసినా ఓ మాట మాట్లాడినా కూడా అది వైరల్ అవుతుంది. వివాదాలకు దారి తీస్తుంది. అదే వర్మ ప్రత్యేకత. కావాలని మరీ వివాదాలను గెలికి మరి తట్టి లేపుతాడు. తాజాగా వర్మ కన్నడ ఇండస్ట్రీపై ప్రేమను కురిపిస్తూ మిగతా వాటిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు. అది కూడా బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలను పోల్చుతూ ట్వీట్లు వేశాడు.
అయితే వర్మ చెప్పినదాంట్లో సత్యముంది. ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీని అందరూ తక్కువగా చూసేవారు. అక్కడ వంద కోట్లు కొల్లగొట్టడమనేది గగనం. అసలు అత్యంత తక్కువ బడ్జెట్, తక్కువ కలెక్షన్లు వస్తుంటాయని ట్రోల్ కూడా చేసేవారు. ఇదే విషయాన్ని ఇప్పుడు ఆర్జీవీ ట్వీట్ వేశాడు. రెండేళ్ల క్రితం కన్నడ ఇండస్ట్రీని బాలీవుడ్ కాకుండా సౌత్ ఇండస్రీకూడా పట్టించుకోలేదు. కానీ ప్రశాంత్ నీల్, యశ్ మాత్రం కన్నడ ఇండస్ట్రీ ప్రపంచ పటంలోకి ఎక్కించారంటూ ప్రశంసించాడు.
అంతే కాకుండా చాప్టర్ 2 టీజర్ రికార్డుల గురించి మాట్లాడుతూ బాహుబలి, ఆర్ఆర్ఆర్‌ను ఏకిపారేశాడు. బాహుబలి 2 ట్రైలర్‌ను మూడేళ్లలో 11 కోట్ల మంది చూశారు. ఆర్ఆర్ఆర్ టీజర్లను మూడు నెలల్లో 3.8కోట్ల మంది వీక్షించారు. కానీ చాప్టర్ 2 టీజర్‌ను కేవలం మూడు రోజుల్లోనే 2.14కోట్ల మంది చూశారు.. ప్రశాంత్ నీల్ కన్నడిగుల తరుపున నిలబడి.. మిగతా అన్నీ ఇండస్ట్రీల పొట్ట మీద కొట్టేశాడు అంటూ కౌంటర్ వేశాడు.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.