పొట్టగొట్టేసిన ప్రశాంత్ నీల్.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ పరువుదీసిన ఆర్జీవీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

పొట్టగొట్టేసిన ప్రశాంత్ నీల్.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ పరువుదీసిన ఆర్జీవీ

రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎలా మాట్లాడతాడో ఎందుకు మాట్లాడతాడో కూడా తెలీదు. కానీ వర్మ ఓ ట్వీట్ వేసినా ఓ మాట మాట్లాడినా కూడా అది వైరల్ అవుతుంది. వివాదాలకు దారి తీస్తుంది. అదే వర్మ ప్రత్యేకత. కావాలని మరీ వివాదాలను గెలికి మరి తట్టి లేపుతాడు. తాజాగా వర్మ కన్నడ ఇండస్ట్రీపై ప్రేమను కురిపిస్తూ మిగతా వాటిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు. అది కూడా బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలను పోల్చుతూ ట్వీట్లు వేశాడు. అయితే […]

 Authored By uday | The Telugu News | Updated on :15 January 2021,11:30 am

రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎలా మాట్లాడతాడో ఎందుకు మాట్లాడతాడో కూడా తెలీదు. కానీ వర్మ ఓ ట్వీట్ వేసినా ఓ మాట మాట్లాడినా కూడా అది వైరల్ అవుతుంది. వివాదాలకు దారి తీస్తుంది. అదే వర్మ ప్రత్యేకత. కావాలని మరీ వివాదాలను గెలికి మరి తట్టి లేపుతాడు. తాజాగా వర్మ కన్నడ ఇండస్ట్రీపై ప్రేమను కురిపిస్తూ మిగతా వాటిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు. అది కూడా బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలను పోల్చుతూ ట్వీట్లు వేశాడు.

RGV Praises Prashnath Neel And Yash

RGV Praises Prashnath Neel And Yash

అయితే వర్మ చెప్పినదాంట్లో సత్యముంది. ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీని అందరూ తక్కువగా చూసేవారు. అక్కడ వంద కోట్లు కొల్లగొట్టడమనేది గగనం. అసలు అత్యంత తక్కువ బడ్జెట్, తక్కువ కలెక్షన్లు వస్తుంటాయని ట్రోల్ కూడా చేసేవారు. ఇదే విషయాన్ని ఇప్పుడు ఆర్జీవీ ట్వీట్ వేశాడు. రెండేళ్ల క్రితం కన్నడ ఇండస్ట్రీని బాలీవుడ్ కాకుండా సౌత్ ఇండస్రీకూడా పట్టించుకోలేదు. కానీ ప్రశాంత్ నీల్, యశ్ మాత్రం కన్నడ ఇండస్ట్రీ ప్రపంచ పటంలోకి ఎక్కించారంటూ ప్రశంసించాడు.

అంతే కాకుండా చాప్టర్ 2 టీజర్‌ రికార్డుల గురించి మాట్లాడుతూ బాహుబలి, ఆర్ఆర్ఆర్‌ను ఏకిపారేశాడు. బాహుబలి 2 ట్రైలర్‌ను మూడేళ్లలో 11 కోట్ల మంది చూశారు. ఆర్ఆర్ఆర్‌ టీజర్లను మూడు నెలల్లో 3.8కోట్ల మంది వీక్షించారు. కానీ చాప్టర్ 2 టీజర్‌ను కేవలం మూడు రోజుల్లోనే 2.14కోట్ల మంది చూశారు.. ప్రశాంత్ నీల్ కన్నడిగుల తరుపున నిలబడి.. మిగతా అన్నీ ఇండస్ట్రీల పొట్ట మీద కొట్టేశాడు అంటూ కౌంటర్ వేశాడు.

uday

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది