vishnupriya Rithu Chowdary : విష్ణు ప్రియ‌- రీతూ చౌద‌రి ల‌వ‌ర్ ఒక‌డేనా.. వామ్మో వీరి బాగోతం మాములుగా లేదుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

vishnupriya Rithu Chowdary : విష్ణు ప్రియ‌- రీతూ చౌద‌రి ల‌వ‌ర్ ఒక‌డేనా.. వామ్మో వీరి బాగోతం మాములుగా లేదుగా..!

vishnupriya Rithu Chowdary : టాలీవుడ్ యాంక‌ర్స్‌లో మంచి గుర్తింపు సంపాదించుకున్న విష్ణు ప్రియ‌- రీతూ చౌద‌రి మంచి ఫ్రెండ్స్ అన్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. వీరిద్ద‌రు ప‌లు షోల‌లో సంద‌డి చేయ‌డ‌మే కాకుండా అప్పుడ‌ప్పుడు విహార యాత్ర‌ల‌కి వెళుతుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వారు షేర్ చేసే పిక్స్‌కి మంచి క్రేజ్ ఉంటుంది. ఒకరిని మించి ఒకరు బోల్డ్ ఫోటో షూట్స్ తో కాకరేపుతూ ఉంటారు. విష్ణుప్రియ, రీతూ చౌదరి స్కిన్ షోపై తరచుగా ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చిన […]

 Authored By ramu | The Telugu News | Updated on :6 July 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  vishnupriya Rithu Chowdary : విష్ణు ప్రియ‌- రీతూ చౌద‌రి ల‌వ‌ర్ ఒక‌డేనా.. వామ్మో వీరి బాగోతం మాములుగా లేదుగా..!

vishnupriya Rithu Chowdary : టాలీవుడ్ యాంక‌ర్స్‌లో మంచి గుర్తింపు సంపాదించుకున్న విష్ణు ప్రియ‌- రీతూ చౌద‌రి మంచి ఫ్రెండ్స్ అన్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. వీరిద్ద‌రు ప‌లు షోల‌లో సంద‌డి చేయ‌డ‌మే కాకుండా అప్పుడ‌ప్పుడు విహార యాత్ర‌ల‌కి వెళుతుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వారు షేర్ చేసే పిక్స్‌కి మంచి క్రేజ్ ఉంటుంది. ఒకరిని మించి ఒకరు బోల్డ్ ఫోటో షూట్స్ తో కాకరేపుతూ ఉంటారు. విష్ణుప్రియ, రీతూ చౌదరి స్కిన్ షోపై తరచుగా ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చిన కూడా వారు మాత్రం ఘాటు అందాల‌తో కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంటారు. అయితే ఈ జంట ఎవ‌రితో అయిన రిలేష‌న్‌లో ఉన్నారా అని నెటిజ‌న్స్ అనుమానాలు వ్య‌క్తం చేస్తూ ఉంటారు. విష్ణుప్రియపై ఎలాంటి ఎఫైర్ రూమర్స్ లేవు. రీతూ చౌదరి మాత్రం ఓ వ్యక్తితో రిలేషన్ లో ఉన్నారనే టాక్ ఉంది. ఆ వ్యక్తి పేరు శ్రీకాంత్ .

vishnupriya Rithu Chowdary అలా అనేసింది ఏంటి..

రీతూ చౌదరి అతనితో దిగిన ఫోటోలు గతంలో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయ‌గా,అత‌డిని ఆమె వివాహం చేసుకుంటుంద‌నే ప్ర‌చారం న‌డిచింది. అయితే కొన్నాళ్లకి వారిద్ద‌రికి బ్రేకప్ జ‌రిగింద‌ట‌. సోషల్ మీడియా చాట్ లో కూడా రీతూ చౌదరి బాయ్ ఫ్రెండ్ శ్రీకాంత్ ని దూరం పెట్టినట్లు పరోక్షంగా కామెంట్స్ చేసింది.కాని కొద్దిరోజులకే రీతూ చౌదరి-శ్రీకాంత్ కలిసి కనిపించారు. అయితే విష్ణుప్రియ మాజీ లవర్ తో రీతూ చౌదరి ఎఫైర్ నడుపుతున్నదన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. శ్రీముఖి యాంకర్ గా ఉన్న కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలో అనసూయ, రీతూ చౌదరి, విష్ణుప్రియ, శోభా శెట్టి, ప్రియాంక జైన్ పాల్గొన్నారు. ఈ షోలో కాలేజ్ థీమ్ తో స్కిట్స్ చేశారు. ఇందులో రీతూ చౌదరి తన బాయ్ ఫ్రెండ్ కి లవ్ లెటర్ రాసింది. అది అందరి ముందు చదివింది.

vishnupriya Rithu Chowdary విష్ణు ప్రియ‌ రీతూ చౌద‌రి ల‌వ‌ర్ ఒక‌డేనా వామ్మో వీరి బాగోతం మాములుగా లేదుగా

vishnupriya Rithu Chowdary : విష్ణు ప్రియ‌- రీతూ చౌద‌రి ల‌వ‌ర్ ఒక‌డేనా.. వామ్మో వీరి బాగోతం మాములుగా లేదుగా..!

నువ్వు నా లైఫ్ లోకి వచ్చాక షాపింగ్ చేయడం మానేస్తా… ఎందుకంటే నీ బట్టలు నేను ధరించాలి. నీ కోసం చేసే కాఫీతోనే నా రోజు మొదలవ్వాలి… అని రీతూ చౌదరి ఆ లవ్ లెటర్ లో రాసింది. ‘నీ వాడికి కాఫీ అలవాటు లేదు కదా’ అని విష్ణుప్రియ రీతూ చౌదరితో అంది. ‘మా వాడికి కాఫీ అలవాటు లేదని నీకు ఎలా తెలుసు?’ అని విష్ణుప్రియను రీతూ చౌదరి అడిగింది. ఎందుకంటే ఆ అబ్బాయిని నీ కంటే ముందు నేను ప్రేమించాను కాబట్టి… అని బాంబు పేల్చింది. దాంతో షోలో ఉన్నవాళ్ళంట షాక్ అయ్యారు. మరి నిజంగా విష్ణుప్రియ మాజీ లవర్ రీతూ చౌదరి ప్రస్తుత లవరా లేక… సెన్సేషన్ కోసం విష్ణుప్రియ అలా చెప్పిందా అని అంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది