Rhea chakraborty : రియా చక్రవర్తి కి మళ్ళీ సినిమాలలో ఛాన్స్..మొత్తానికి సాధించింది..!

Authored By vamana sai | The Telugu News | Updated on: March 19, 2021, 10:35 am

Rhea chakraborty : బాలీవుడ్ లో గతేడాది మొత్తం ఒకటే టాపిక్ నడిచింది. అదే రియా చక్రవర్తి గురించింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ విషయంలో రియా ఎదుర్కొన్న సిబిఐ విచారణలు, జైలుకి వెళ్ళడాలు..లాంటి వ్యవహారలతో ముంబై మీడియా మొత్తం వేడెక్కిన సంగతి తెలిసిందే. అక్కడే కాదు సౌత్ లో కూడా ఈ టాపిక్ హాట్ టాపిక్ అయింది. సెన్షేషనల్ న్యూస్ అవడంతో పాటు ఇందుకు లింక్ ఉన్న డ్రగ్స్ వ్యవహారం కూడా బయట పడింది. ఇందులో కూడా పలువురు స్టార్ సెలబ్రిటీలు విచారణ కి హాజరయ్యారు.

అయితే ఇక రియా సినిమా కెరీర్ క్లోజ్ అని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా మళ్ళీ సినిమాలలో అవకాశం అందుకుంది. ఇప్పుడు ఈ న్యూస్ అటు నార్త్ ఇటు సౌత్ మొత్తం సంచలనం అవుతోంది. బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘చెహ్రే’. ఈ సినిమాలో బిగ్‌ బి అమితాబ్ బచ్చన్ తో పాటు ఇమ్రాన్‌ హష్మి, రియా చక్రవర్తి నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో అమితాబ్ నటిస్తున్నందుకు ఎంత హాట్ టాపిక్ అవుతుందో రియా ప్రధాన పాత్ర పోషిస్తున్నందుకు అంతే హాట్ టాపిక్ అయింది.

Rhea chakraborty

Rhea chakraborty

Rhea chakraborty : ఆ క్రెడిట్ మొత్తం రియా కే చెందుతుంది అంటూ ఇప్పుడు చెప్పుకుంటున్నారు.

అమితాబ్‌, ఇమ్రాన్ హష్మిలాంటి హై కేస్టింగ్‌తో కలిసి నటించిన గొప్ప అవకాశాన్ని అందుకున్నప్పటికి ఆ తర్వాత రియా విచారణల చుట్టూ తిరుగుతుండటం తో సినిమా నుంచి తప్పించారు. అంతేకాదు పోస్టర్స్ లో కూడా తీసేశారు. సినిమాలో రియా ఉంటే పెద్ద డామేజ్ అవుతుందన్నదే కారణం. ఈ విషయంలో చాలా మంది అమితాబ్ బచ్చన్ ని కూడా కామెంట్ చేశారు. అయితే ఎట్టకేలకి విడుదల చేసిన ట్రైలర్‌లో మాత్రం సడెన్‌గా రియా ప్రత్యక్షమయింది. దాంతో ప్రతీ ఒక్కరికీ మైండ్ బ్లాకయింది. రియా ప్లేస్ లో డూప్ ని పెట్టి తీశారన్న కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ రియా సినిమాలో ఉన్నందుకు పిచ్చి పబ్లిసిటీ వచ్చేసింది. ఏం జరిగిందో..ఎలా జరిగిందో గానీ సినిమాలో రియా గ్యారెంటీగా అందరినీ డామినేట్ చేస్తుందని..సినిమా సూపర్ హిట్ అయితే ఆ క్రెడిట్ మొత్తం రియా కే చెందుతుంది అంటూ ఇప్పుడు చెప్పుకుంటున్నారు.

Also read

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp