
Rocket Raghava Romantic Performance In Sridevi Drama Company
Rocket Raghava : రాకెట్ రాఘవకు బుల్లితెరపై మంచి ఇమేజ్ ఉంది. ఎప్పటి నుంచో సినిమాల్లో నటిస్తున్నాడు. కమెడియన్‌గా మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే అతను బుల్లితెరపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టేశాడు. జబర్దస్త్ పుట్టినప్పటి నుంచి రాఘవ ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా కనిపించాడు. మోస్ట్ సీనియర్‌గా రాఘవను చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ అంతా ఏ ఇబ్బంది లేకుండా చూడగలిగే స్కిట్లలో రాఘవ స్కిట్లు ముందుంటాయి.
Rocket Raghava Romantic Performance In Sridevi Drama Company
ఎక్కడా కూడా వల్గారిటీకి తావివ్వడు. క్లీన్ యూ సర్టిఫికేట్‌లా ఉంటాయి రాఘవ స్కిట్లు.అలాంటి రాఘవ ఇప్పుడు రూటు మార్చేశాడు. శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో రెచ్చిపోతోన్నాడు. గత కొన్ని వారాలుగా రాఘవ గేరు మార్చేశాడు. రొమాంటిక్ ట్రాక్ ఎక్కేశాడు. తన టీంలో ఓ యంగ్ అమ్మాయిని తెచ్చిపెట్టుకున్నాడు. ఆమెతో కలిసి శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో రొమాన్స్ చేస్తున్నాడు. అదిరిపోయే డ్యాన్సులు వేస్తున్నాడు. గత వారం కూడా ఇలానే రాఘవ రొమాంటిక్ డ్యాన్స్ పర్ఫామెన్స్ చేయగా దానికి ప్రశంసలు వచ్చాయి. దీంతో ఈ వారం కూడా అలాంటి ఓ మోస్ట్ రొమాంటిక్ డ్యాన్స్ నంబర్ చేశాడు.
ఈ వారం రాబోయే శ్రీదేవీ డ్రామా కంపెనీలో రాఘవ రెచ్చిపోయాడు. చిరు పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశాడు. వానజల్లు గిల్లుతుంటే ఎట్టగమ్మా.. అంటూ అమ్మాయితో రొమాన్స్ చేశాడు. ఇక వర్షాన్ని కూడా సెటప్ చేశాడు. అలా నీళ్లలో తడుస్తూ ఈ ఇద్దరూ వేసిన పర్ఫామెన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇంద్రజకు అయితే సెగలు పుట్టినట్టున్నాయి. వెరీ రొమాంటిక్ పర్ఫామెన్స్ అంటూ ఇంద్రజ పొగిడేసింది. మొత్తానికి రాఘవ కూడా రొమాంటిక్ ట్రాకులతో ఫేమస్ అవ్వాలని చూస్తున్నాడేమో.ఇంతకు ముందు తన కొడుకు మురారిని తీసుకొచ్చి హల్చల్ చేశాడు. ఇప్పుడు రాఘవ ఇలా అమ్మాయిలతో డ్యాన్సులు వేస్తూ రొమాన్స్ చేస్తూ బుల్లితెరపై సెగలు పుట్టిస్తున్నాడు. మొత్తానికి ఈ వారం శ్రీదేవీ డ్రామా కంపెనీలో అయ్యగారే నెంబర్ వన్ అంటూ రచ్చ రచ్చ చేయబోతోన్నారు.
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.