Anil Ravipudi : స్నేహా నోట్లో పెట్టేసిన రాకేష్‌.. కౌంటర్ వేసిన అనిల్ రావిపూడి

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: October 15, 2022, 7:30 pm

Anil Ravipudi : బుల్లితెరపై కొత్త షో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రతీ మంగళవారం ఈ షోను ప్రసారం చేయబోతోన్నారు. ఈ వారం ఘనంగా ప్రారంభించిన మిస్టర్ అండ్ మిసెస్ షోకు సంబంధించిన ప్రోమో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో శ్రీముఖి, అనిల్ రావిపూడి, శివ బాలాజీ పంచ్‌లతో దుమ్ములేపేశారు. ఇక రాకింగ్ రాకేష్‌ సైతం తన స్టైల్లో అందరినీ నవ్వించేశాడు. ఈ స్టేజ్ మీద పది జంటలు పార్టిసిపేట్ చేయబోతోన్న సంగతి తెలిసిందే.

రవికిరణ్‌–సుష్మా , పవన్‌–అంజలి, సందీప్‌–జ్యోతి, హ్రితేష్‌–ప్రియా, శ్రీవాణి–విక్రమ్‌, మధు–ప్రియాంక , ప్రీతమ్‌–మానస, సిద్దు–విష్ణుప్రియ, రాకేశ్‌–సుజాత, విశ్వ–శ్రద్ధ వీరంతా పర్ఫామెన్స్ చేశారు. శ్రీవాణి విక్రమ్ జంట మీద రాకేష్ కౌంటర్లువేశాడు. విక్రమ్ వస్త్రాధారణ మీద సెటైర్లు వేశాడు.ఆ హారం ఎక్కడిది అంటూ పరువుతీశాడు. ఇక రాకేష్‌ స్టేజ్ మీదకు వచ్చి.. స్నేహకు తినిపించాడు.

Rocking Rakesh Fun WIth Sneha And Anil Ravipudi in Mister & Misses

Rocking Rakesh Fun WIth Sneha And Anil Ravipudi in Mister & Misses

యాపిల్ ముక్కను స్నేహా నోట్లో పెట్టేశాడు రాకేష్. ఆ తరువాత అనిల్ రావిపూడికి తినిపించేందుకు ప్రయత్నించాడు.కానీ నువ్ మాత్రం తినిపించకు అని అనిల్ రావిపూడి కౌంటర్ వేశాడు. శివ బాలాజీ సైతం అలానే కౌంటర్లు వేశాడు. మనం ఎన్నో రాత్రులు కలిసి చేశాం అంటూ ఇలా రాకేష్ ఏదో డబుల్ మీనింగ్ డైలాగ్ కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఆ డైలాగ్ విని శివ బాలాజీ నవ్వేశాడు. అరేయ్ మనం ఏంట్రా అని శివ బాలాజి నోరెళ్లబెట్టడంతో.. చీ చీ అది కాదు అని రాకేష్ కవర్ చేసే ప్రయత్నం చేస్తాడు. మొత్తానికి ప్రస్తుతం ఈ ప్రోమో మాత్రం నెట్టింట్లో దుమ్ములేపేస్తోంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp