Home » Entertainment » Rocking Rakesh Kissed Rohini In Jabardasth
Entertainment

Rocking Rakesh: చటుక్కున ముద్దు పెట్టిన జబర్దస్త్ రాకేష్.. షాక్ తిన్న రోహిణి

Authored By
Tech Desk
The Telugu News | Updated on: July 20, 2021 12:15 pm
Advertisement

Rocking Rakesh: బుల్లితెరపై జబర్దస్త్‌కు ఉన్న పేరు గురించి అందరికీ తెలిసిందే. జబర్దస్త్‌ను బూతు షోగా అభివర్ణించే వారే ఎక్కువ మంది ఉంటారు. అయితే జబర్దస్త్‌లో అందరూ అదే దారిలో వెళ్లరు. కొందరు మాత్రం వల్గారిటీకి దూరంగా ఉంటారు. డబుల్ మీనింగ్ డైలాగ్‌లను దరి చేరనివ్వరు. అలాంటి వారిలో రాకింగ్ రాకేష్ ముందుంటారు. ఒకప్పుడు చిన్న పిల్లలతో కలిసి స్కిట్లు వేసిన రాకేష్.. ఇప్పుడు సీరియల్ నటి, బిగ్ బాస్ ఫేమ్ రోహిణిని జంటగా తెచ్చుకున్నారు. ఈ జంటకు మంచి ఫాలోయింగ్ పెరిగింది.

Advertisement

Rocking Rakesh Kissed Rohini In Jabardasth

ఈ ఇద్దరి మధ్య ట్రాక్ వేసేద్దామని జబర్దస్త్ టీం కూడా బాగానే ప్రయత్నించింది. తామిద్దరం మంచి స్నేహితులం, కష్టాల్లో ఎంతో సాయం చేసిందంటూ రోహిణి గురించి చెబుతూ రాకేష్ ఎమోషనల్ అయ్యారు. ఈ ఇద్దరి కెమిస్ట్రీ కూడా స్కిట్లో బాగానే పేలుతుంటుంది. భార్యాభర్తలుగా ఎన్నో స్కిట్లు వేసిన వీరు.. ఎప్పుడూ కూడా హద్దులు దాటలేదు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లో ఈ ఇద్దరూ ఎంతో సరదాగా ఉంటారు. అయితే తాజాగా మాత్రం రాకింగ్ రాకేష్ షాక్ ఇచ్చాడు.

Advertisement

చటుక్కున ముద్దు పెట్టిన జబర్దస్త్ రాకేష్.. షాక్ తిన్న రోహిణి

స్కిట్‌లో భాగంగా రాకేష్ హద్దులు దాటేశాడు. భార్యాభర్తలకే ఉద్యోగం ఇస్తానని అనడం, తామిద్దరం భార్యాభర్తలమేనని రాకేష్ చెప్పడం.. ఆ వెంటనే రోహిణిని దగ్గరకు తీసుకుని చెంపకు చెంపను అంటించడం, ముద్దు పెట్టడంతో రోహిణి దెబ్బకు షాక్ అయింది. అయితే ఇది ముందుగా ప్రాక్టీస్ చేశారో లేదా? అక్కడికక్కడే అలా చేశాడో తెలియదు గానీ రోహిణి పెట్టిన ఎక్స్‌ప్రెషన్స్ మాత్రం అదిరిపోయాయి. ఆమెకు తెలియకుండానే ఇదంతా చేసినట్టు కనిపిస్తోంది.

Tech Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి