
Roja Dance At 75th Independence Day Celebrations
Roja : ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపిన రోజా ఇటీవల టీవీ షోలకు జడ్జిగా వ్యవహరించింది. మంత్రి అయిన తర్వాత పూర్తిగా ప్రజలలోనే తిరుగుతూ వస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న హంసధ్వని తొమ్మిదవ వార్షకోత్సవ ముగింపు సభకు మంత్రి రోజా హాజరయ్యారు. మంత్రి రోజాను డైరెక్టర్ స్వాతి సోమనాథ్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని వేదిక మీదకు తీసుకొచ్చారు. హంసధ్వని పుస్తకాన్ని రోజా ఆవిష్కరించారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య సంబరాల్లో భాగంగా ఇటువంటి కార్యక్రమానికి హాజరు కావటం పైన రోజా హర్షం వ్యక్తం చేసారు. ఈ సంస్థ ద్వారా మూడు రోజుల పాటు అక్కడ ధ్యాన..నాట్య..సంగీత ప్రదర్శనలను ఏర్పాటు చేసారు.
చామంతి పువ్వా అంటూ తన హిట్ సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. మంత్రి రోజా స్వాతిసోమనాధ్ తో కలిసి డాన్స్ చేశారు. ఈ కార్యక్రమం ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి రోజా.. తన డ్యాన్సుతో అలరించారు.రోజాతోపాటు ఆహుతులు కూడా డాన్స్ చేయడంతో ఆ సంప్రదాయ నృత్యానికేతన్ ప్రాంగణం కరతలధ్వనులతో మార్మోగిపోయింది. గతంలో రోజా జబర్ధస్థ్ లోనూ డాన్స్ మాస్టర్ శేఖర్ తో కలిసి ఒక ప్రత్యేక ఈవెంట్ లో రోజా ఈ పాట మొత్తానికి డాన్స్ చేసారు. తనకు ఇది చాలా ఇష్టమైన పాటగా రోజా చెప్పుకొచ్చారు.
Roja Dance At 75th Independence Day Celebrations
ఇప్పుడు మంత్రిగా ఉంటూనే ఈ స్టెప్పులు వేయటం పైన ఆనందిస్తూ.. అభినందించిన వారు కొందరైతే..మంత్రిగా ఉంటూ ఆ స్టెప్పులు ఏంటంటూ విమర్శించే వారు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీదిరి అప్పలరాజు, కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మంత్రి డ్యాన్స్ చేయడంతో వారు తెగ సంతోషం వ్యక్తం చేస్తూ ఆస్వాదించారు. రోజాకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తుంది. కాగా, పోటీ ప్రపంచంలో.. మార్కుల కోసం, ర్యాంకుల కోసం పరుగుల తీస్తున్న పిల్లలకి, వారిలో ఒత్తిడిని వారు జయించడానికి ఇలాంటి మంచి కళలు, సంగీతం, నాట్యం ఉపయోగపడతాయన్నారు. క్రీడల వైపు కాస్త ఫోకస్ పెంచి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు రోజా.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.