Roja : లేపుకెళ్లేంత ఫిగరా? నీది.. ఇమాన్యుయేల్ పరువుదీసిన రోజా

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 2 October 2021, 8:45 pm

Roja జబర్దస్త్ స్టేజ్ మీద ఎన్నో ట్రాకులు వచ్చాయి. వెళ్లాయి. జనాల ట్రోలింగ్‌కు కొన్ని అలానే నిలబడ్డాయి. ఇంకొన్ని అలా కొట్టుకుపోయాయి. మొత్తానికి అలా రొమాంటిక్ జంటలుగా కొంత మంది జనాల్లో క్రేజ్ తెచ్చుకున్నారు. వారిలో ఇమాన్యుయేల్, వర్షలు కూడా ఉంటారు. ఒకప్పుడు ఈ ఇద్దరు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. స్కిట్లో వీరు చేసిన అతి మామూలుగా ఉండేది కాదు. ఒకరిని మించి మరొకరు యాక్టింగ్ చేసేవారు. జబర్దస్త్ టీం కూడా ఈ ఇద్దరి ట్రాకును బాగానే పైకి లేపింది.

roja humiliated emmanuel in extra jabaradsth

roja humiliated emmanuel in extra jabaradsth

చివరకు అతి విషమించడంతో పడుకోబెట్టేసింది. అలా వర్ష ఇమాన్యుయేల్ జోడి ఇప్పుడు వర్కవుట్ అవ్వడం లేదు. పెళ్లి స్కిట్‌తో ఈ జోడికి దారుణమైన ట్రోలింగ్ ఎదురైంది. అలా ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి జంటగా స్కిట్లు వేయడం లేదు. భాస్కర్ టీంలో ఫైమా, ఇమాన్యుయేల్, వర్షలు చేస్తున్నారు. అయితే ఈ నలుగురి మధ్య వచ్చే సెటైర్లు బాగానే పేలుతున్నాయి. మరీ ముఖ్యంగా ఫైమా అయితే దుమ్ములేపేస్తోంది. తాజాగా వదిలిన ప్రోమోలోనూ ఫైమానే హైలెట్ అయింది.

roja humiliated emmanuel in extra jabaradsth

roja humiliated emmanuel in extra jabaradsth

Roja ఇమాన్యుయేల్ ఫైమా స్కిట్..

బుల్లెట్ భాస్కర్ టీం ప్రోమోలో దుమ్ములేపింది. ఇమాన్యుయేల్, ఫైమా జంటగా వచ్చారు. అరేయ్ మనం పెళ్లి చేసుకుందాం రా.. నన్ను లేపుకుపోరా అని ఇమాన్యుయేల్‌ను ఫైమా అడుగుతుంది. నిజం చెప్పే నీది లేపుకుపోయే ఫిగరేనా? అని అసహ్యంగా ఇమాన్యుయేల్ అనేస్తాడు. ఆ వెంటనే రోజా రంగంలోకి దిగేస్తుంది. నీది మాత్రం లేపుకెళ్లేంత ఫిగరా? అని ఇమాన్యుయేల్ పరువుతీస్తుంది రోజా. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మొత్తానికి ఇమాన్యుయేల్ ఫైమా జోడికి కూడా మంచి మార్కులే పడుతున్నాయి.

roja humiliated emmanuel in extra jabaradsth

roja humiliated emmanuel in extra jabaradsth

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి