Roja : లంగావోణీలో డ్యాన్స్ తో అద‌ర‌గొడుతున్న రోజా.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Roja : లంగావోణీలో డ్యాన్స్ తో అద‌ర‌గొడుతున్న రోజా..

Roja : హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అగ్ర క‌థానాయ‌కుల‌తో ఎన్నో సినిమాల్లో నటించింది రోజా సెల్వ‌మ‌ణి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, పొలిటీషియన్ గా, జబర్థస్త్ జడ్జిగా రాణించిన రోజా రీసెంట్ గా మంత్రిగా బాధ్య‌తలు చేప‌ట్టి త‌న‌దైన శైలిలో దూసుకుపోతోంది. చిత్తూరు జిల్లా తిరుప‌తిలో నాగ‌రాజు రెడ్డి, ల‌లితా దంప‌తుల‌కు జ‌న్మించిన రోజా అస‌లు పేరు శ్రీ‌ల‌తరెడ్డి. కాగా రోజా ప్రేమ తపస్సు సినిమాతో హీరోయిన్ గా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో చిరంజీవి, బాల‌కృష్ణ‌, […]

 Authored By mallesh | The Telugu News | Updated on :1 May 2022,12:30 pm

Roja : హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అగ్ర క‌థానాయ‌కుల‌తో ఎన్నో సినిమాల్లో నటించింది రోజా సెల్వ‌మ‌ణి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, పొలిటీషియన్ గా, జబర్థస్త్ జడ్జిగా రాణించిన రోజా రీసెంట్ గా మంత్రిగా బాధ్య‌తలు చేప‌ట్టి త‌న‌దైన శైలిలో దూసుకుపోతోంది. చిత్తూరు జిల్లా తిరుప‌తిలో నాగ‌రాజు రెడ్డి, ల‌లితా దంప‌తుల‌కు జ‌న్మించిన రోజా అస‌లు పేరు శ్రీ‌ల‌తరెడ్డి. కాగా రోజా ప్రేమ తపస్సు సినిమాతో హీరోయిన్ గా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్, నాగార్జునల‌తో ప‌లు సినిమాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇ.వి.వి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన సీతారత్నం గారి అబ్బాయి చిత్రం మంచి బ్రేక్ ఇచ్చింది. అలాగే ముఠామేస్త్రి, ముగ్గురు మొనగాళ్లు, భైరవ ద్వీపం, గాండీవం, బొబ్బిలి సింహం, శుభలగ్నం వంటి చిత్రాలు రోజాకి మంచి పేరు తెచ్చాయి.కాగా రోజా త‌మిళంలో చెంబ‌రుతి సినిమాతో అక్క‌డ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ డైరెక్ట‌ర్ సెల్వ‌మ‌ణి కాగా ఈయ‌న‌నే రోజా పెళ్లి చేసుకుంది. కాగా వీరికి ఒక పాప, ఒక బాబు. సినిమాల్లో హీరోయిన గా న‌టించిన రోజా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ గా ప‌లు సినిమాల్లో న‌టించింది.

Roja latest Video Viral

Roja latest Video Viral

బుల్లితెర‌పై జ‌బ‌ర్ద‌స్త్ షోలో ఇన్నాళ్లు జ‌డ్జిగా ఆక‌ట్టుకుంది. అలాగే పండ‌గ స‌మ‌యాల్లో స్పెష‌ల్ ఈవెంట్ల‌లో కూడా ఎంట్రీ ఇస్తూ త‌న డ్యాన్స్ తో అద‌ర‌గొడ‌తోంది.న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా సెల్వ‌మ‌ణి ప్ర‌స్తుతం మంత్రి బాధ్య‌త‌లు చేప‌ట్టి మ‌హిళా మంత్రిగా నిత్యం వార్త‌ల్లో నిలుస్తోంది. కాగా రోజా డ్యాన్స్ చేసిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. రోజా లంగావోణీలో ఓ పాట‌కి డ్యాన్స్ చేస్తూ ఎన‌ర్జి లెవ‌ల్స్ ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని ఫ్రూవ్ చేస్తోంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది