Roja : జబర్దస్త్ షో నుంచి రోజా అవుట్.. కారణం అదేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Roja : జబర్దస్త్ షో నుంచి రోజా అవుట్.. కారణం అదేనా?

Roja : జబర్దస్త్ షో అంటే ప్రస్తుతం అంతా కూడా రోజామయమే. రోజా చెప్పిందే అక్కడ వేదం. అందరూ రోజాకు భక్తులే. రోజా ఏం అంటే అదే నడుస్తుంది. నాగబాబు ఉన్నంత కాలం రోజాకు రెండో స్థానం ఉండేది. నాగబాబు చెప్పిందే నడిచేది. ఆ సమయంలో రోజా నామమాత్రంగా ఉండేది. నాగబాబు వెళ్లిపోవడం రోజాకు బాగానే కలిసి వచ్చింది.అయితే ఈ జబర్దస్త్ షోలకు జడ్జ్‌గా రోజా ఉండటం మాత్రం ఎప్పుడూ వివాదాస్పదంగానే మారుతుంటుంది. తన రాజకీయ జీవితంలో […]

 Authored By prabhas | The Telugu News | Updated on :2 April 2022,7:00 pm

Roja : జబర్దస్త్ షో అంటే ప్రస్తుతం అంతా కూడా రోజామయమే. రోజా చెప్పిందే అక్కడ వేదం. అందరూ రోజాకు భక్తులే. రోజా ఏం అంటే అదే నడుస్తుంది. నాగబాబు ఉన్నంత కాలం రోజాకు రెండో స్థానం ఉండేది. నాగబాబు చెప్పిందే నడిచేది. ఆ సమయంలో రోజా నామమాత్రంగా ఉండేది. నాగబాబు వెళ్లిపోవడం రోజాకు బాగానే కలిసి వచ్చింది.అయితే ఈ జబర్దస్త్ షోలకు జడ్జ్‌గా రోజా ఉండటం మాత్రం ఎప్పుడూ వివాదాస్పదంగానే మారుతుంటుంది. తన రాజకీయ జీవితంలో ఈ షో గురించి ఎప్పుడూ కాంట్రవర్సీ జరుగుతూనే ఉంటుంది.

అయితే ఆ మధ్య రోజా ఈ షోలను మానేస్తుందనే ప్రచారం జరిగింది. అప్పుడు కొన్ని రోజులు ఈ షోలకు దూరంగా ఉంటూ వచ్చింది. ఆ తరువాత మళ్లీ తన స్థానంలో తానే కనిపించింది.మరోసారి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రోజా కొంత కాలం దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలోనే ఇంద్రజ వంటి వారు వెలుగులోకి వచ్చారు. ఇంద్రజ, ఆమని, సంగీత ఇలా ఎంతో మందిని తీసుకొచ్చారు. మొత్తానికి చివరకు ఇంద్రజ బాగానే సెట్ అయింది.

Roja May Quit Jabardasth AFter getting Minister Post

Roja May Quit Jabardasth AFter getting Minister Post

శ్రీదేవీ డ్రామా కంపెనీ, జాతి రత్నాలు అంటూ ఇంద్రజ బుల్లితెరపై బాగానే సందడి చేస్తోంది.అయితే రోజా మాత్రం ఇక బుల్లితెరకు దూరంగా ఉండబోతోందనే టాక్ బయటకు వచ్చింది. రోజాకు మంత్రి పదవి కన్ఫామ్ కానుందట. అందులో భాగంగానే ఈ షోలకు రోజా దూరంగా ఉండనుందని తెలుస్తోంది. మంత్రి పదవి దక్కితే ఈ షోలను మానేయాల్సి వస్తుందని తెలిసే.. ఇప్పటి నుంచే దూరంగాఉంటుందని తెలుస్తోంది. అందుకే ఈ వారం జరిగిన ఎపిసోడ్‌లో రోజా కనిపించిలేదేమోనని అంతా అనుకుంటున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది