Aarthi Agarwal : తెలుగు సినిమా రంగంలో రెండు దశాబ్దాల క్రితం ఒక్కసారిగా మెరుపులా దూసుకు వచ్చింది ఆర్తి అగర్వాల్. నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఆమెకు హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. తొలి సినిమాయే సూపర్ హిట్ కావడంతో ఆమె ఒక్కసారిగా తెలుగు యువత మదిలో కలల రాణి గా మారిపోయింది. నాగార్జున – వెంకటేష్ – బాలకృష్ణ – చిరంజీవి – ఉదయ్ కిరణ్ – తరుణ్ – ఎన్టీఆర్ – మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో వరుసపెట్టి ఛాన్స్ కొట్టేసింది. మళ్లీ ఆ సమయంలోనే లవర్ బాయ్ తరుణ్ తో ఆమె ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వచ్చాయి. ఏమైందో ఏమో ఆ తర్వాత తరుణ్ తో బ్రేకప్ అయిందని అన్నారు. బ్రేకప్ తర్వాత ఆర్తి అగర్వాల్ కెరీర్ పూర్తిగా డల్ అయిపోవడం తో పాటు ఆమె ఫేడ్ అవుట్ అయిపోయింది…
ఆర్తి అగర్వాల్‌తో తరుణ్ ప్రేమాయణం నడిపారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ వాస్తవాలు మాత్రం ఎవరికీ కూడా తెలియదు. ఈ విషయంపై హీరో తరుణ్ తల్లి రోజారమణి పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఆర్తి అగర్వాల్‌ను నేను రెండుసార్లు మాత్రమే కలిశాను. ఆమె సైలెంట్‌గా, ఎంతో హుందాగా ఉండేది. అలాంటి అమ్మాయి సడన్‌గా ఎందుకు ప్రాణాలు తీసుకుందో తెలియదు. వారిద్దరి మధ్య సీరియస్ గా రూమర్స్ వచ్చాయి. ఇంట్లో పెద్దలుగా మేము వాళ్ళిద్దరి పెళ్ళికి ఒప్పుకోలేదు అనుకోండి.. వాళ్ళకి సమస్య ఏంటి.. వాళ్లిద్దరూ మెజర్స్.. ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకుని ఉండొచ్చు. పోనీ ఇంట్లో పెద్దలని ఒప్పించి చేసుకుని ఉండొచ్చు.
తరుణ్.. ఆర్తి అగర్వాల్ తో పెళ్లి విషయం నాతో ఎప్పుడూ డిస్కస్ చేయలేదు. ఈ కాలం పిల్లలు ఇంట్లో ఒప్పుకోకపోతే పెళ్లి చేసుకోవడం మానేస్తారా అని రోజా రమణి అన్నారు. అయితే తరుణ్ ని మాత్రం తాను హెచ్చరించిన విషయం వాస్తవమే అని రోజా రమణి అన్నారు. మీ ఇద్దరి పై రూమర్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. అమ్మాయితో క్లోజ్ గా ఉంటే బయటకి అందరికి తెలిసేలా ఎందుకు ఎక్స్ ఫోజ్ అవడం.. కొంచెం జాగ్రత్త అని హెచ్చరించాను. ఆ తర్వాత వాళ్లిద్దరూ కలసి నటించలేదు. ఆ అమ్మాయి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వాళ్లిద్దరూ నిజంగా ప్రేమించుకుని ఉంటే మాకు చెప్పి ఉండాలి కదా అని రోజా రమణి అన్నారు. కానీ సడెన్ గా ఆమె చనిపోయింది అని న్యూస్ వచ్చింది. చాలా బాధపడ్డాం. ఆమె చాలా చిన్న పిల్ల.. అలా జరగడం బాధాకరం అని రోజా రమణి తెలిపారు.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.