Home » Entertainment » Roja Satires On Sudigali Sudheer
Entertainment

Sudigali Sudheer : నీ కంటే విష్ణుప్రియే బెటర్.. సుడిగాలి సుధీర్ పరువు తీసిన రోజా

Authored By
Sam C
The Telugu News | Published on: March 8, 2022, 9:30 pm
Advertisement

Sudigali Sudheer : బుల్లితెర‌పై తెగ వినోదం పంచుతున్న‌కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మం. ఇందులో న‌వ్వులు పంచుతూ ప్రేక్ష‌కుల‌కి తెగ వినోదం పంచుతూ ఉంటారు. రోజా కూడా త‌న‌దైన శైలిలో పంచ్‌లు వేస్తూ హాస్యం పంచుతూ ఉంటుంది. తాజాగా ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ధ‌స్త్ ప్రోమో విడుద‌ల కాగా, ఇందులో సుడిగాలి సుధీర్ మాంత్రికుడు వేషం ధ‌రిస్తాడు. అయితే విష్ణు ప్రియ కూడా ఇందులో ఒక రోల్ చేసింది. ఆమె గెట‌ప్ వేయ‌గా, అది చూసిన రోజా.. నీకంటే విష్ణు ప్రియ‌నే బాగుంది అంటూ సుధీర్ ప‌రువు తీసింది. ఇక సుధీర్ అయితే రామ్ ప్ర‌సాద్ తో పాటు తోటి కంటెస్టెంట్స్‌తో తెగ సంద‌డి చేసాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

Advertisement

సుడిగాలి సుధీర్- రష్మి మధ్య ఎఫైర్ వార్త చక్కర్లు కొట్టినంతగా.. బుల్లితెరపై ఇంతకు మించిన రూమర్ లేదనే చెప్పాలి. అయితే అదంతా స్క్రీన్‌పై రొమాన్స్ బాగా పండించడంలో భాగం తప్ప.. మరేం లేదని.. పర్శనల్ లైఫ్‌లో ఎవరిదారి వారిదే అంటూ క్లారిటీ ఇచ్చారు. రష్మి ఇప్పటికే వేరే వ్యక్తితో లవ్‌లో ఉండగా.. సుధీర్ పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక రష్మి తరువాత సుధీర్‌తో ఎఫైర్ లిస్ట్‌లో పోటీ పడుతోంది హాట్ యాంకర్ విష్ణు ప్రియ. ఈ మధ్య కాలంలో డాన్స్‌లతో రచ్చ రచ్చ చేస్తూ సోషల్ మీడియాలో అందాలను ఆరబోతున్న విష్ణు ప్రియ‌తో సుధీర్‌కి ఎఫైర్ నడుస్తోందంటూ వస్తున్న రూమర్స్‌పై స్పందించారు విష్ణు ప్రియ.

roja satires on Sudigali Sudheer

Advertisement

Sudigali Sudheer : సుధీర్ గాలి తీసేసిందిగా..!

ఆ మ‌ధ్య విష్ణు ప్రియ‌.. సుధీర్‌తో రిలేష‌న్‌పై నోరు విప్పింది. సుధీర్ నాకు బెస్ట్ ఫ్రెండ్. నా ఫస్ట్ ఇండస్ట్రీ ఫ్రెండ్ సుధీర్. ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వచ్చినా వెంటనే నేను సుధీర్‌కి ఫోన్ చేస్తా. శ్రీముఖి, కీర్తనలు నాకు పిల్లర్స్ లాంటి వాళ్లు నేను ఏదైనా తప్పు చేస్తుంటే.. వీళ్లు చూస్తున్నారేమో అని ఫీల్ అయ్యేటంతగా నా లైఫ్‌లో వాళ్లు ఒక పార్ట్ అయ్యారు. నేను చాలా నాటీ.. శ్రీముఖిలాగే. వీళ్ల మధ్యన నేను పిల్ల బచ్చాని. నా పర్శనల్ విషయంల్లో వాళ్లు సలహాలు చాలా ఉపయోగపడతాయి. మా ఇద్ద‌రి మ‌ధ్య మంచి అండ‌ర్‌స్టాండింగ్ ఉంటుంది అని విష్ణు ప్రియ చెప్పుకొచ్చింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి