Home » Entertainment » Roja Serious On Kevvu Karthik Shanthi Swaroop Skit
Entertainment

Roja : ఆ కామెంట్లతో మండిపడ్డ రోజా.. షోలోనే అందరి ముందు సీరియస్

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: March 24, 2022, 4:30 pm
Advertisement

Roja : జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో ఇప్పుడు రోజా ఎంత చెబితే అంత అన్నట్టుగా మారిపోయింది వ్యవహారం. ఆమె వేసిందల్లా పంచ్.. నవ్వితే సెటైర్.. అన్నట్టుగా ఉంది. ఇక స్కిట్ల మధ్యలో దూరి రోజా వేసే పంచులు, కౌంటర్లు అయితే కొదవే లేదు. తాజాగా రోజా ఓ స్కిట్ వేసింది. ఇందులో భాగంగా జడ్జిగా ఉండేందుకు కొన్ని సూచనలిస్తూ ట్రైనింగ్ సెంటర్ పెట్టేసినట్టుగా స్కిట్ వేసింది. ఈ ఎపిసోడ్‌కు లైలా స్పెషల్ గెస్టుగా వచ్చేసింది. అయితే ఆమని కూడా ఆ ట్రైనింగ్ సెంటర్‌కు వచ్చేసింది.

Advertisement

ఆమని నువ్ బాగానే చేస్తున్నావ్ కదా? ఎందుకు వచ్చావ్ అని రోజా అడుగుతుంది. నేను బాగానే చేస్తే మీరు లైలాను ఎందుకు తీసుకొస్తారు అని అంటుంది. అయితే జడ్జ్‌గా ఎలా ఉండాలో వారికి డెమో ఇస్తుంది. ఇందులో భాగంగా కెవ్వు కార్తీక్, శాంతి స్వరూప్ స్కిట్ వేస్తారు. నువ్ మేకప్ తీస్తే రోజా గారిలా ఉంటావ్ అని శాంతి స్వరూప్‌తో రోజాను పోలుస్తాడు కెవ్వు కార్తీక్. దీంతో రోజా సీరియస్ అవుతుంది. ఏయ్. నవ్వుతున్నాం కదా? అని ఏదంటే అది జోక్స్ వేసేస్తావా?.. ముగ్గురు జడ్జ్‌లను పిలిచినప్పుడు కంటెంట్ ఎంత బాగుండాలి..

Roja Serious On Kevvu Karthik Shanthi Swaroop Skit

Advertisement

Roja : స్కిట్‌లో రోజా సీరియస్..

ఏదో ఒక పిచ్చి డైలాగ్ చెబితే చూసేస్తామని అనుకున్నావా? అని రోజా సీరియస్ అయి వెళ్లిపోతూ ఉంటుంది. అయ్యో మేడం ఏంటి అలా వెళ్లిపోతోన్నారు అని ఆమని కంగారు పడుతుంది. మనకు బ్రేక్ కావాలని అనుకున్నప్పుడు ఇలా చేసి వెళ్లిపోవాలి అని కన్నుకొడుతుంది. దీంతో ఆమని, లైలా షాక్ అవుతారు. మిగతా వారంతా తెగ నవ్వేస్తుంటారు. మొత్తానికి రోజా మాత్రం అందరినీ సీరియస్ అయినట్టుగా నమ్మించేసింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి