RRR Glimpse Review : అదరగొడుతున్న ‘ఆర్ఆర్ఆర్’ గ్లింప్స్.. రికార్డులు తిరగరాయడం ఖాయం..!
RRR Glimpse Review: ప్రపంచంలో ఉన్న సినీ ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ గ్లింప్స్‌ను మేకర్స్ సోమవారం ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. కాగా, ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.టాలీవుడ్ జక్కన్న, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ మల్టీ స్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, కొమురం భీంగా జూనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఫిక్షనల్ స్టోరిగా వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌లో అద్భుతమైన విజ్యువల్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఎంఎం కీరవాణి మ్యూజిక్‌తో పాటు ఫైట్ సీక్వెన్సెస్ అత్యద్భుతంగా తెరకెక్కించినట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. గ్లింప్స్‌లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగాన్, బ్యూటిఫుల్ హీరోయిన్ ఆలియా భట్ కనిపించారు. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ నుంచి విడుదలైన ‘దోస్తీ’ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ స్పెషల్ గ్లింప్స్ ద్వారా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై అంచనాలు ఇంకా పెరిగాయని చెప్పొచ్చు. ఈ చిత్రంలో రామ్ చరణ్ తేజ్ సరసన ఆలియా భట్ నటిస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్‌కు జోడీగా ఒలివియా నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమాలోని పాత్రల ఇంటెన్సిటీని దర్శకుడు రాజమౌళి 45 సెకన్ల గ్లింప్స్‌లో చాలా క్లియర్‌గా చూపించేశారు. గ్లింప్స్‌ను చూసి మెగా, నందమూరి అభిమానులతో పాటు సినీ అభిమానులు ఈ సినిమా గత రికార్డులను తిరగరాయడం ఖాయమని అనుకుంటున్నారు.
RRR Glimpse Review : అద్భుతమైన విజ్యువల్స్.. ఆకట్టుకునే ఫైట్స్..
వచ్చే ఏడాది జనవరి 7న సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల కానుంది. అయితే, సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అప్పుడే ప్రమోషనల్ యాక్టివిటీస్ షురూ చేశాడు. పీవీఆర్‌తో కొలాబరేట్ అయి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. త్వరలో మూవీ యూనిట్ సభ్యులు, హీరోలు కూడా ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ ఈవెంట్స్ పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.