RRR : రాజమౌళి కంటే పదింతలు ఎక్కువ బాధ్యత ఉంది ఆయన మీదే..

Authored By vamana sai | The Telugu News | Published on: January 24, 2021, 6:45 pm

RRR Movie :  ఆర్ఆర్ఆర్ ఇప్పుడు దేశం మొత్తం లో హాట్ టాపిక్. అందుకు కారణం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు.. కొమరం భీం పాత్రలే. ఈ రెండు అత్యంత శక్తి వంతమైన పాత్రలని దర్శక ధీరుడు రాజమౌళి వెండి తెర మీదకి ఏ విధంగా తీసుకు రాబోతున్నాడు. భారీ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుంది అని అందరి చూపు ఈ సినిమా మీదే ఉంది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ పోరాట యోధులుగా దాదాపు 400 కోట్ల తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

ఇక ఇప్పటికే ఆర్ఆర్ఆర్ నుంచి భీం ఫర్ రామరాజు – రామరాజు ఫర్ భీం టీజర్స్ తో సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో రాజమౌళి జస్ట్ శాంపిల్ చూపించాడు. అటు మెగా అభిమానులు ఇటు నందమూరి అభిమానులు వందేళ్ళ పాటు చెప్పుకునేలా ఆర్ఆర్ఆర్ ని తీసుకు రాబోతున్నట్టు ఈ రెండు టీజర్స్ తో హింట్ ఇచ్చాడు. కాగా తాజాగా ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ షెడ్యూల్ లో రాం చరణ్ – ఎన్.టి.ఆర్ పాల్గొంటున్నారు. రీసెంట్ గా ఈ క్లైమాక్స్ కి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఆర్ఆర్ఆర్ మీద అంచనాలు ఏ ఒక్కరి ఊహకి అందడం లేదు.

RRR : రాజమౌళి కంటే ఆర్ఆర్ఆర్ సినిమా బాధ్యత ఎక్కువగా సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి మీదే..!

అయితే రాజమౌళి కంటే ఆర్ఆర్ఆర్ సినిమా బాధ్యత ఎక్కువగా సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి మీదే అదనంగా ఉందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. బాహుబలి రెండు భాగాలకి కీరవాణి అందించిన సాంగ్స్ .. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా స్థాయిని ఎంతగా పెంచాయో అందరికీ తెలిసిందే. బాహుబలి సక్సస్ లో క్రెడిట్ ఖచ్చితంగా కీరవాణి కి చెందుతుంది. అదే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మీద రెట్టింపు చేసిందని చెప్పుకుంటున్నారు. ఒకరకంగా ఆర్ఆర్ఆర్ కీరవాణి కి పెద్ద సవాల్ అంటున్నారు. చూడాలి మరి ఆర్ఆర్ఆర్ విషయంలో కీరవాణి ఎలాంటి ప్రశంసలు అందుకుంటారో. కాగా రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ నుంచి ఈ నెల 26 భారీ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

vamana sai

No bio available for this author.

  1. "AP Municipal Election Results : ఏపీలో కూటమి ప్రభంజనం.. పులివెందులలోనూ వైసీపీకి షాక్!"

  2. "Superstar Krishna Remuneration : సూపర్ స్టార్ కృష్ణ తొలి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.? విజయనిర్మల చెప్పిన ఆసక్తికర విషయాలు!"

  3. "US Midterm Elections 2026 : అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే మనకు లాభమా? నష్టమా?"

  4. "Chandrababu : డిసెంబరులో ఏపీ కేబినెట్‌లో మార్పులు? పల్నాడు, రాయలసీమ కు కొత్త మంత్రులు!"

  5. "Home Loan Tips : బ్యాంకులు చెప్పని సీక్రెట్‌.. 20 ఏళ్ల హోమ్ లోన్‌ను త్వరగా తీర్చాలా? ఈ 5 స్మార్ట్ EMI పద్ధతులు పాటించండి..!"

  6. "AP Municipal Election Results : ఏపీ మున్సిపల్ ఫలితాలకు అంతా రెడీ.. ఉదయం 8 గంటల నుంచే లెక్కింపు..!"

  7. "Rising Stars Asia Cup 2026 : నవంబర్ 22న మ‌రోసారి భారత్-పాక్ బిగ్ ఫైట్.. తిలక్ వర్మకు కెప్టెన్సీ!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp