RRR Movie : ‘ఆర్ఆర్ఆర్’ బిగ్ అప్‌డేట్.. ట్రైలర్ రిలీజ్ డేట్‌ను విడుదల చేసిన మేకర్స్..!
RRR Movie : దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ వచ్చే ఏడాది జనవరి 7న సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్‌ను మూవీ మేకర్స్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను మూవీ మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
RRR Movie : థియేటర్స్‌లో సందడే సందడి.. ఆనందం వ్యక్తం చేస్తున్న మెగా, నందమూరి ఫ్యాన్స్..
‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్‌ను ఈ నెల 9న అన్ని థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా చూసేందుకుగాను సినీ ప్రేమికులందరూ వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో టాలీవుడ్ నెవర్ బిఫోర్ హీరోస్ కాంబినేషన్ సెట్ అయింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించారు. కొమురం భీంగా తారక్, అల్లూరి సీతారామరాజుగా చెర్రీ కనిపించనున్నారు.

rrr Movie trailer release date announced by makers
‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో తాను మూడు గెటప్స్‌లో కనబడబోతున్నట్లు ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చెప్పారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్స్ ‘దోస్తీ, నాటు నాటు, జననీ’ సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. టీజర్స్, సాంగ్స్ ఫిల్మ్ పైన ఎక్స్‌పెక్టేషన్స్‌ను ఇంకా పెంచేశాయి. ఎం.ఎం.కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఆలియా భట్ నటించగా, తారక్ సరసన హాలీవుడ్ భామ ఒలివియా నటించింది.