Home » Entertainment » Rrr Natu Natu Song Won Oscar Award
Entertainment

Oscar 2023: ఆస్కార్ గెలిచేసిన “RRR” నాటు నాటు సాంగ్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: March 13, 2023, 8:40 am
Advertisement

Oscar 2023: “RRR” నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలిచేసింది. ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో పోటీపడి చివరకు అవార్డు సొంతం చేసుకోవడం జరిగింది. దీంతో “RRR” సినిమా యూనిట్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అంతకుముందే గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా గెలవటంతో కచ్చితంగా ఆస్కార్ గెలుస్తుందని అందరూ భావించారు. ఆ రీతిగానే ఇప్పుడు “RRR” నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలిచేసింది.

Advertisement

దాదాపు వారం రోజులకు పైగానే “RRR” సినిమా యూనిట్ అమెరికాలో ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవానికి హాజరయ్యి పలు ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ వచ్చేలా రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఎవరికివారు ఇంటర్వ్యూలు ఇస్తూ రాణించడం జరిగింది. ఈ క్రమంలో చిరాకరికి ప్రపంచ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు “RRR” సొంతం చేసుకుంది.

RRR Natu Natu Song Won Oscar Award

Advertisement

ఇదిలా ఉంటే ఆస్కార్ అవార్డు ప్రధాన ఉత్సవం జరుగుతున్న వేదికపై లైవ్ పెర్ఫార్మెన్స్ లో “నాటు నాటు” పాటని పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ.. ఆస్కార్ వేదికపై అద్భుతమైన పర్ఫామెన్స్ ఇవ్వడం జరిగింది. నాటు నాటు సాంగ్ పాడుతున్నప్పుడు ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవానికి హాజరైన ప్రముఖులంతా చప్పట్లు కొడుతూ తమ ప్రశంసలు తెలిపారు. “RRR”కీ ఆస్కార్ అవార్డు రావటంతో భారతీయ సినిమా ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్థాయి ప్రపంచ స్థాయికి రాజమౌళి తీసుకెళ్లారని కొనియాడుతున్నారు.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి