
brs sarpanch navya fires on mla rajaiah
BRS Sarpach Navya : ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన ఘటన బీఆర్ఎస్ సర్పంచ్ నవ్య ఇష్యూ. ఆమె జనగామ జిల్లా ధర్మసాగర్ మండలం జానకిపురం గ్రామ సర్పంచ్. ఇటీవల.. తనపై స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మీడియా ముందు వాపోయిన విషయం తెలిసిందే. ఆ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాజయ్య తనను చాలా వేధిస్తున్నారని.. నిధులు కావాలంటే ఒంటరిగా రమ్మంటున్నారని ఆమె ఆరోపణలు చేశారు. మీటింగ్ లలో, సమావేశాల్లో తనపై చాలాసార్లు అసభ్యంగా ప్రవర్తించారని, తాను ఆయన్ను ఒక తండ్రిలా భావించానని కానీ.. ఆయన మాత్రం తనను లైంగికంగా
brs sarpanch navya fires on mla rajaiah
వేధించారని నవ్య సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం బీఆర్ఎస్ పెద్దలకు చేరడం, వెంటనే రాజయ్యపై పెద్దలు సీరియస్ అవడంతో వెంటనే జానకిపురం వచ్చి నవ్యకు రాజయ్య సారీ చెప్పారు. ఆ తర్వాత రాజయ్యతో కలిసి నవ్య ప్రెస్ మీట్ నిర్వహించారు. మరోసారి నవ్య ప్రెస్ మీట్ పెట్టి మా ఊరిని ఎందుకు డెవలప్ చేయరు అని ఎమ్మెల్యే రాజయ్యను ప్రశ్నించారు. సమాజంలో జరిగే అన్యాయాల గురించి చెబుతున్నా.. సమాజంలో జరిగే అక్రమాల గురించి చెబుతున్నా. మూడు రోజుల నుంచి నన్ను చాలా మంది అడుగుతున్నారు. అన్యాయంగా అరాచకాలు సృష్టిస్తే, మాకు నిధులు ఇవ్వకపోతే కిరోసిన్ పోసి తగులబెట్టే నాలాంటి వందలాది ఆడవాళ్లు పుట్టుకొస్తారు అంటూ ఆమె సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఎవరో ఏదో అన్నారని ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎవ్వరి అణచివేతలకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎవరి వల్ల మనం ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు మా గ్రామానికి ఏం చేస్తారో చెప్పాలి. ఇప్పటి వరకు మా గ్రామం నుంచి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చోటు చేసుకోలేదు. మీరు ఏం చేస్తారో మీడియా ముందే చెప్పాలి. నా పదవి కూడా 8 నెలలే ఉంది. మీరు మా గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేస్తారో చెప్పాలి. మాకు ఎలాంటి సమస్య వచ్చినా మీరే ముందుండి చూసుకోవాలి అని ఆమె ఆయన్ను కోరారు.
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.