RRR : ఆర్ఆర్ఆర్ కి గుమ్మడికాయ కొట్టబోతున్నారా .. ఇది కదా ఎప్పటినుంచో అందరు కావాలనుకుంటుంది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

RRR : ఆర్ఆర్ఆర్ కి గుమ్మడికాయ కొట్టబోతున్నారా .. ఇది కదా ఎప్పటినుంచో అందరు కావాలనుకుంటుంది..!

 Authored By govind | The Telugu News | Updated on :9 February 2021,7:00 am

RRR : ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఇన్నాళ్ళు ఎలాంటి న్యూస్ వస్తుందని అందరు ఆతృతగా ఎదురు చూస్తున్నారో అలాంటి న్యూస్ వచ్చింది. ఇక మెగా అభిమానులకి.. నందమూరి అభిమానులకి పండుగ రోజులు వచ్చినట్టే అంటున్నారు. ఎందుకంటే త్వరలో ఆర్ఆర్ఆర్ నుంచి భారీ స్థాయిలో రాజమౌళి శైలికి మించి ప్రమోషన్స్ మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. అందుకు కారణం ఆర్ఆర్ఆర్ మార్చ్ నెల చివరికి వరకు కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది. గత ఏడాది అక్టోబర్ 5 న రాజమౌళి ఆర్ఆర్ఆర్ ని షూట్ ని మొదలు పెట్టి రాత్రింబవళ్ళు చిత్రీకరణ జరుపుతున్నాడు.

ఇటీవలే రాం చరణ్ – ఎన్.టి.ఆర్ మీద క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. అప్పుడప్పుడు ఆన్ లొకేషన్ లో ని పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గానూ మారుతున్నాయి. ఇలా తారక్ – చరణ్ ల ఫొటోస్ బయటకి వచ్చిన ప్రతీసారి అటు మెగా అభిమానులు ఇటు నందమూరి అభిమానులు తెగ షేర్ చేసుకుంటున్నారు. ఇక తాజాగా మార్చ్ వరకు ఆర్ఆర్ఆర్ షూటింగ్ కంప్లీట్ అవుతుందన్న న్యూస్ రాగానే నెక్స్ట్ ఈ సినిమా నుంచి ఎలాంటి సర్‌ప్రైజింగ్ అప్‌డేట్స్ వస్తాయో అని టాక్ మొదలైంది. బాహుబలి తర్వాత మళ్ళీ రాజమౌళి నుంచి వస్తున్న ఆర్ఆర్ఆర్ .. అది కూడా భారీ మల్టీస్టారర్ కావడంతో ఊహించని రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి.

RRR : తారక్ – చరణ్ లని ఒకే ఫ్రేం లో చూసినప్పుడు అభిమానులకి నిక్కబొడుచుకుంటాయట..!

కాగా ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ని ఇప్పటికే ప్రకటించారు. అక్టోబర్ 13 న ప్రపంచ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. అన్ని ప్రధాన పాత్రలో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఆర్ఆర్ఆర్ బిజినెస్ కూడా మొదలైందని తెలుస్తోంది. కాగా ఆర్ఆర్ఆర్ లో తారక్ భీం గా.. చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా శక్తివంతమైన పాత్రల్లో నటిస్తున్నారు. తారక్ – చరణ్ లని ఒకే ఫ్రేం లో చూసినప్పుడు అభిమానులకి .. ప్రేక్షకులకి రోమాలు నిక్కబొడుచుకుంటాయని చిత్ర బృందం ధీమాగా చెబుతున్నారు. ఇక ఆలియా భట్, అజయ్ దేవగన్..బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

govind

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి