RRR Team : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా లోని నాటు నాటు అనే పాట అంతర్జాతీయ స్థాయి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డును సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్ ఆనందానికి అవదులు లేవు. అంతర్జాతీయ స్థాయి పురష్కారం దక్కించుకున్న కీరవాణి పై ప్రధాని నరేంద్ర మోడీ సహా ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. అభినందనలతో పాటు విమర్శలు కూడా అప్పుడప్పుడు ఉంటాయి. ఇప్పుడు నాటు నాటు అవార్డు పై విమర్శలు కూడ ఆ వస్తున్నాయి.
ఒక సీనియర్ జర్నలిస్ట్ తన ఫేస్ బుక్ లోనాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డును కొనుక్కున్నారు అంటూ ఆరోపించాడు. అంతర్జాతీయ స్థాయి అవార్డులు ఇచ్చే యొక్క జ్యూరీని కొనుగోలు చేసేంత స్థాయి జక్కన్న టీమ్ కు ఉందా అంటే ఆయన అవును అనే సమాధానం చెబుతున్నాడు. ఈ అవార్డు రావడం వెనుక పబ్లిసిటీ కృషి ఉంది. అది మాత్రం వాస్తవం కానీ కొనుగోలు చేశారు అనేది మాత్రం నూటికి నూరు శాతం అవాస్తవం. కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాను అంతర్జాతీయ వేదిక మీద పబ్లిసిటీ చేయడం
జరిగింది. ఆ పబ్లిసిటీ బాగా కలిసి వచ్చి ఈ సినిమాకు అవార్డు దక్కింది. అంతే కాని అవార్డును కొనుగోలు చేయలేదు. ఎంతటి గొప్ప సినిమా అయినా కూడా పబ్లిసిటీ చేస్తేనే జనాల్లోకి వెళ్తుంది. అలాగే అవార్డులను దక్కించుకుంటుంది. అదే జక్కన్న టీమ్ చేశారు. అంతే తప్ప అవార్డును కొనుగోలు చేయలేదు. సోషల్ మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడటం ఏమాత్రం కరెక్ట్ కాదు. మన సినిమాకు ఇలాంటి అంతర్జాతీయ స్తాయి అవార్డు రావడంను ప్రతి ఒక్కరు సంతోషించాల్సిన విషయం.. అంతే తప్ప కోడిగుడ్డు మీద ఈకలు పీకడం కరెక్ట్ కాదు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.