ఆరు వారాలైనా అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతున్న రుహానీ శర్మ Her - Chapter 1
Her – Chapter 1 : థియేటర్, ఓటీటీ అంటూ ఆడియెన్స్ సపరేట్ అయ్యారు. కొన్ని చిత్రాలు థియేటర్లో బాగా ఆడుతుంటే.. ఇంకొన్ని సినిమాలు ఓటీటీలో అదరగొడుతున్నాయి. మరి కొన్ని మూవీస్ అక్కడా, ఇక్కడా అన్ని చోట్ల సక్సెస్ అవుతున్నాయి. తాజాగా రుహానీ శర్మ నటించిన Her – Chapter 1 (హర్ చాప్టర్ 1) మూవీ ఓటీటీలో ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. గత ఆరువారాలుగా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో మంచి వ్యూస్‌తో టాప్ 10లో ట్రెండ్ అవుతోంది.
శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వంలో దీప సంకురాత్రి, రఘు సంకురాత్రి నిర్మించిన హర్ చాప్టర్ 1లో రుహానీ శర్మ Ruhani sharma మెయిన్ లీడ్‌గా నటించారు. ఏసీపీ అర్చనా ప్రసాద్‌గా రుహానీ శర్మ తన నటనతో ఆకట్టుకున్నారు. సిటీలో జరిగిన హత్యలకు, తన ఫ్లాష్ బ్యాక్‌లో ప్రియుడ్ని పోగొట్టుకున్న కేసుకి లింక్ ఉండటం, వాటిని ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో అర్చనకు ఎదురయ్యే సవాళ్లన్నీ కూడా ఎంతో ఎంగేజింగ్‌గా ఉంటాయి.
ఇక రెండో పార్ట్ మీద మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఈ చాప్టర్ 1 ముగుస్తుంది. ఈ మూవీని గ్రిప్పింగ్‌గా తెరకెక్కించిన శ్రీధర్‌కు మంచి ప్రశంసలు లభించాయి. ఎంతో ఇంటెన్స్ ఉన్న పాత్రను చక్కగా పోషించిన రుహానీ శర్మ మీద ఆడియెన్స్ ప్రేమను కురిపించారు. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్‌లో ఇంకా ట్రెండ్ అవుతుండటం విశేషం.
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…
This website uses cookies.