Sai Pallavi : మహేష్ బాబు vs మగాళ్లు అంటూ నమ్రతా ఉండగానే సాయి పల్లవి తీవ్ర వ్యాఖ్యలు !

 Authored By jagadesh | The Telugu News | Updated on :17 October 2022,5:30 pm

Sai Pallavi : సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తను ఎంత మంచి నటో.. అంతకంటే ఎక్కువ డ్యాన్సర్. తన డ్యాన్స్ తోనే తనకు సినిమా అవకాశాలు వచ్చాయని చెప్పుకోవచ్చు. తనకు టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లోనూ క్రేజ్ ఉంది. తను తీసిన చాలా సినిమాలు హిట్ అయ్యాయి. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అంటే గుర్తొచ్చే పేరు కూడా సాయి పల్లవిదే. సాయి పల్లవికి ఉన్న క్రేజ్ అటువంటిది. తన సినిమాలు ఫెయిల్ అయినా సరే.. తనకు ఆఫర్లు మాత్రం వస్తూనే ఉంటాయి.

తన యాక్టింగ్ తో పాటు డ్యాన్స్ కూడా తనకు ప్లస్. అలాగే.. కొందరు హీరోయిన్లలా తను ఎక్స్ పోజింగ్ కు దూరం. గ్లామర్ షో అంటే నో అని డైరెక్ట్ గా చెప్పేస్తుంది సాయి పల్లవి. తన డ్యాన్స్ ను చూసి ఫిదా అవ్వని వాళ్లు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరో గురించి ఈ అమ్మడు షాకింగ్ విషయాలు వెల్లడించింది. సినిమాలకు ఒప్పుకొనేటప్పుడు ఏ హీరో అయితే బాగుంటుంది. ఏ హీరో పక్కన నటిస్తున్నారో ముందే అడుగుతారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఈ హీరోతో.. ఆ హీరోతో నటించాలి..

Sai Pallavi comments on mahesh babu

Sai Pallavi comments on mahesh babu

Sai Pallavi : మహేశ్ స్క్రీన్ ప్రజెన్స్ అంటే ఇష్టం అని చెప్పిన సాయి పల్లవి

అని ప్రత్యేకంగా నాకు ఎలాంటి కోరికలు లేవు అని చెప్పింది సాయి పల్లవి. అయితే.. తనకు కథ నచ్చితేనే చేస్తా అని చెప్పింది. స్టార్ హీరోనే కావాలని ఏం లేదు అని చెప్పింది. నేను కేవలం నటిని. నాకు ఆ పాత్ర నచ్చితే చేస్తా. ఒక నటిగా నాకు ఉన్న పరిమితులకు లోబడి నేను నటిస్తా. అల్లు అర్జున్ డ్యాన్స్ అంటే ఇష్టం. మహేశ్ బాబు స్క్రీన్ ప్రజెన్స్ అంటే ఇష్టం. బాబోయ్.. మగవాళ్లు ఇంత అందంగా ఉంటారా? అని ఆయన్ను చూశాకనే అర్థం అయింది అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసింది సాయి పల్లవి. అలాగే.. బాలీవుడ్ లోనూ కొందరు నటులంటే ఇష్టం అని చెప్పింది.

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి