Home » Entertainment » Sai Pallavi Commnts On Dance Shows
Entertainment

Sai Pallavi : అతిపెద్ద వివాదం లో ఇరుక్కున్న సాయి పల్లవి – దేవుడు కూడా కాపాడలేడు !

Authored By
Rame Samhith
The Telugu News | Published on: November 5, 2022, 7:40 pm
Advertisement

Sai Pallavi : మళయళ ప్రేమం సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి తెలుగులో ఫిదాతో ఎంట్రీ ఇచ్చి ఆ సినిమాతో కూడా సూపర్ హిట్ కొట్టి వరుస క్రేజీ ప్రాజెక్ట్ లతో దూసుకెళ్తుంది అమ్మడు. తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో నటిస్తున్నా తెలుగులోనే అమ్మడికి ఓ రేంజ్ పాపులారిటె వచ్చింది. ఇక్కడ అమ్మడికి లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ కూడా ఇచ్చేశారు. ఇచ్చిన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తూ వచ్చే సాయి పల్లవి సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్నా కొన్ని విషయాల్లో ఇరుకున పడుతుంది.

Advertisement

సాయి పల్లవి లేటెస్ట్ గా మరో వివాదంలో చిక్కుకుంది. డ్యాన్సర్ గానే తన కెరియర్ మొదలు పెట్టిన సాయి పల్లవి లేటెస్ట్ గా ఆ డ్యాన్స్ షోల మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. డ్యాన్స్ రియాలిటీ షోల్లో అవకతవకలు జరుగుతాయని.. అక్కడ డబ్బున్న వాళ్లకే ఛాన్సులు అంటూ కామెంట్ చేసింది సాయి పల్లవి. అమ్మడు అలా అనడానికి రీజన్ ఏంటి అన్నది తెలియాల్సి ఉంది. తమిళంలో తను పాటిస్పేట్ చేసిన ఉంగళిల్ యారు అడుత్త ప్రభుదేవా షోలో ఆమె రన్నరప్ గా నిలిచారు. ఆ టైం లో పొందిన అనుభవం వల్లే సాయి పల్లవి ఇలా అంటుందేమో కానీ.. డ్యాన్స్ షోలలో డబ్బుకే ప్రాధాన్యత ఇస్తారు. సెలబ్రిటీస్ వారసులకే గౌరవాలు.. మర్యాదలు ఉంటాయంటుంది.

sai pallavi commnts on dance shows

Advertisement

అందుకే డ్యాన్స్ షోల మీద నమ్మకం లేకుండా పోయింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది సాయి పల్లవి. అసలు సాయి పల్లవి ఇలా అనడం ఏంటని కొందరు ఆలోచిస్తున్నారు. సాయి పల్లవి అన్నది అంటే అందులో ఎంతోకొంత నిజం ఉంటుందని సమర్ధించే వారు ఉన్నారు. తన డ్యాన్స్ తోనే తనకు ఒక క్రేజ్ వచ్చేలా చేసుకున్న సాయి పల్లవి సినిమాలో ఉంది అంటే ఏదో ఒక సాంగ్ సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సిందే. అందుకే అమ్మౌ ఇప్పటి స్టార్ హీరోయిన్స్ పక్కన నిలిచింది. తప్పకుండా సాయి పల్లవి ఫ్యూచర్ లో మరిన్ని అద్భుతాలు చేస్తుందని ఆశిస్తున్నారు ఆమె ఫ్యాన్స్.

Rame Samhith

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి