Sai Pallavi: సాయి పల్లవి.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆనతి కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా మారింది. రీసెంట్‌గా చీఫ్ గెస్ట్‌గా కూడా హాజరై సందడి చేసింది సాయి పల్లవి. శర్వానంద్, రష్మిక మందన్నా కలిసి నటించిన `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. దీనికి సాయిపల్లవి , కీర్తిసురేష్‌తోపాటు దర్శకుడు సుకుమార్ గెస్ట్ గా వచ్చారు. హీరోయిన్స్‌పై తెగ ప్రేమ కురిపించారు. హీరోయిన్లు కీర్తిసురేష్ , రష్మిక మందన్నాల గురించి చెబుతూ వారి నటనని అప్రిషియేట్ చేశారు సుకుమార్. వీరు బెస్ట్ యాక్టర్స్ అని కొనియాడారు.
వీరికి గ్యాంగ్ లీడర్ సమంత అంటూ ప్రశంసించారు.సాయి పల్లవి గురించి మాట్లాడాలని అనుకుంటున్న సమయంలో అభిమానులు అరుపులతో మారుమోగిపోయేలా చేశారు. దీంతో సుకుమార్ షాక్ అయ్యారు `నువ్వు లేడీ పవన్ కళ్యాణ్` అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీంతో మరోసారి `ఆడవాళ్లు మీకు జోహార్లు` ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయింది. సాయిపల్లవి మంచి ఆర్టిస్ట్ అని, అదే సమయంలో మంచి హ్యూమన్ బీయింగ్ అని తెలిపారు మంచి నటి మాత్రమే కాదు, మంచి హ్యూమన్ బీయింగ్‌గా కూడాఉండగలగడం ఈ ఫీల్డ్ లో చాలా కష్టమని, అందుకు సాయిపల్లవిని అభినందించారు సుకుమార్.
ఇక సాయిపల్లవి మాట్లాడే సమయంలోనూ అభిమానులు మరోసారి హోరెత్తించారు. మధ్యలో యాంకర్ సుమ కల్పించుకుని అభిమానులను నిలవరింపచేసే ప్రయత్నం చేసింది. అయితే అభిమానులు ఆ రేంజ్‌తో అరవడంతో సాయిపల్లవి స్పందిస్తూ,ఈ ఈవెంట్ మళ్లీ ఏడవడం బాగోదని, మళ్లీ ఏడవలేనని తెలిపింది. `శ్యామ్ సింగరాయ్` ఈవెంట్‌లో ఇదే స్థాయిలో అభిమానులు అరుపులతో హోరెత్తించడంతో సాయిపల్లవి కన్నీళ్లు పెట్టున్న విషయం తెలిసిందే. దాన్ని గుర్తు చేస్తూ మీ ప్రేమకి ధన్యవాదాలు అని తెలిపింది. ఈ ఈవెంట్‌కి గెస్ట్‌గా రాలేదని, ఫ్యామిలీ మెంబర్‌లా వచ్చానని స్పష్టం చేసింది. చీరకట్టులో చాలా ట్రెడిషనల్‌గా హాజరైన సాయి పల్లవి అందరి దృష్టి తనపై పడేలా చేసింది.
Legs Arms : సూర్యకాంతి విటమిన్ డీ కి ముఖ్య మూలం అని చెప్పొచ్చు. అయితే విటమిన్ డీ లోపం ఉన్నవారు…
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే…
This website uses cookies.