Home » Entertainment » Sai Pallavi Forming Pics Viral
Entertainment

Sai Pallavi: పొలం ప‌నులు చేస్తున్న సాయి ప‌ల్లవి..సినిమాలు లేక కూలీగా మారిందా..!

Authored By
Sam C
The Telugu News | Published on: April 3, 2022, 9:30 pm
Advertisement

Sai Pallavi : మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ సాయి ప‌ల్ల‌వి ప్రేమమ్ తో అందరినీ ఆకట్టుకున్న విష‌యం తెలిసిందే. చాలా తక్కువ టైమ్ లోనే హీరోయిన్ గా స్టార్ డమ్ ను సాధించింది. కాని ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా హీరోయిన్ క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ.. తన స్థాయిని పెంచుకుంటుంది. ఫిదా సినిమాలో త‌న అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుంది. భానుమ‌తి ఒక్క‌టే పీస్‌.. అంటూ తెలంగాణ పిల్ల‌గా మ‌న గుండెల్లో గూడు క‌ట్టుకున్న ఈ మ‌ద్దుగుమ్మ కెరీర్‌లో వైవిధ్య‌మైన సినిమాలు చేస్తుంది. ల‌వ్ స్టోరీ, శ్యామ్ సింగ‌రాయ్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన ఈ ముద్దుగుమ్మ రెండు సినిమాల‌తో అల‌రించింది.

Advertisement

త‌న ఖాతాలో రెండు మంచి విజ‌యాలు న‌మోదు చేసుకుంది.సాయి ప‌ల్ల‌వి నెక్ట్స్ మూవీ స్టార్ట్ చేయ‌డానికి కాస్త స‌మయం ఉంది. దీంతో ఆమె ఇంట్లోనే ఉంటుంది. ఉగాది సంద‌ర్భంగా సాయి ప‌ల్ల‌వి రైతు కూలీగా మారింది. మిగ‌తా కూలీల‌తో క‌లిసి పొలం ప‌నులు చేశారు. ఆ ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది సాయి ప‌ల్ల‌వి. నెట్టింట వైర‌ల్ అవుతున్న ఆ ఫొటోల‌ను చూసిన నెటిజ‌న్స్ సాయి ప‌ల్ల‌వి సింప్లిసిటీని అభినందిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సాయి పల్లవి రైతుకూలీగా అవతారం ఎత్తింది. కూలీగా మారి పొలంలో పసుపును ఏరింది. దానికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. వేర్లతో భూమిలోకి బలంగా నాటుకుపోయాయి..

sai pallavi forming pics viral

Advertisement

Sai Pallavi : సింప్లిసిటీకి కేరాఫ్‌..

అయినా, పెకిలించి బయటకు తీసేశాం అంటూ ఆమె కామెంట్ చేసింది.సాయి పల్లవి పోస్ట్ కి చాలా మంది హీరోయిన్లు కూడా రిప్లై ఇస్తున్నారు. చాలా నచ్చిందంటూ అనుపమ పరమేశ్వరన్ ఎమోజీ పెట్టి కామెంట్ చేసింది. నీలా ఎవరూ ఉండలేరు అంటూ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కామెంట్ చేసింది. మరోవైపు సాయి పల్లవి .. హీరో రానాతో కలిసి విరాట పర్వం సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రలో నక్సల్స్ బ్యాగ్రౌండ్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వేణు ఊడుగుల దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి