Home » Entertainment » Sai Pallavi Not Acting The Movies
Entertainment

Sai Pallavi : సినిమాలకి సాయి పల్లవి గుడ్ బై ?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: November 24, 2022, 9:40 pm
Advertisement

Sai Pallavi : హీరోయిన్ సాయి పల్లవి ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగుతోపాటు పలు భాషల్లో నటించింది. మొదటి సినిమాతోని మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అప్పటినుంచి వరుస సినిమాలు చేస్తూ అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్గా మారిపోయింది. ప్రేమమ్ సినిమా అంతలా విజయం సాధించడానికి సాయి పల్లవినే కారణం అని చెప్పవచ్చు. ఆ తర్వాత టాలీవుడ్ టాప్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో ఫిదా సినిమాలో నటించింది.

Advertisement

భానుమతి సింగిల్ పీస్ డైలాగ్ చెప్పిన ఈ అమ్మడు నిజంగానే సింగిల్ పీస్ గా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక ఈ అమ్మడికి తెలుగులో కూడా వరుసగా సినీ ఆఫర్లు వస్తున్నాయి. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోలదాకా ఫస్ట్ ఛాన్స్ గా సాయి పల్లవి పేరే వినిపిస్తోంది. సాయి పల్లవి తెలుగుతోపాటుగా తమిళం, మలయాళంలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. గ్లామర్ షో లకు దూరంగా ఉంటూ నటనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఫుల్ ఫామ్ లో ఉంది ఈ బ్యూటీ. అయితే గత కొద్ది కాలంగా సాయి పల్లవి నటిస్తున్న సినిమాల గురించి ఎటువంటి అప్డేట్ లేదు.

Sai Pallavi not acting the movies

Advertisement

సాయి పల్లవి చివరిగా నటించిన సినిమా గార్గి. లేడీ ఓరియంటెడ్ గా వచ్చిన గార్గి సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే సాయి పల్లవి మెడిసిన్ చదివిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సాయి పల్లవి కోయంబత్తూర్ లో సొంతంగా హాస్పటల్ నిర్మిస్తుందని తెలుస్తుంది. ఇక నటనకు వీడ్కోలు చెప్పి డాక్టర్ గా స్థిరపడాలని చూస్తుందట. ఈ హాస్పిటల్ ను సాయి పల్లవి తన సిస్టర్ పూజా కలిసి నిర్వహించనున్నారని తెలుస్తుంది. అందుకే ఈ అమ్మడు సినిమాలకు గుడ్ బై చెప్పిందని టాక్ వస్తుంది. ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి