ఫిదా బ్యూటీ సాయి పల్లవి చాలా స్ట్రైట్ ఫార్వార్డ్. ఏ విషయాన్ని మనసులో దాచుకోదు. మంచైనా చెడైనా నిర్మొహమాటంగా బయట పెట్టేస్తుంది. సినిమాలు తప్ప వేరే వ్యాపకం ఉండదు. సినిమాలలో తప్ప వేరే విధంగా సంపాదించాలని అనుకోదు. అందుకే రొమాంటిక్ సినిమాలకి .. బోల్డ్ క్యారెక్టర్స్ కి నో చెబుతుంది. అంతేకాదు కమర్షియల్ యాడ్ ఫిలింస్ లో చేస్తే కోట్లు ఇస్తామన్నా నాకవసరం లేదని అంటుంది. సాయి పల్లవి ఎంత టాలెంటెడ్ హీరోయినో అందరికీ తెలిసిందే. కొన్ని సార్లు అదే సాయి పల్లవికి ఇబ్బందులు తెచ్చి పెడుతోందని అంటున్నారు.
గతంలో ఎంసీఏ సినిమా విషయంలో నాని తో సాయి పల్లవికి ఇష్యూ అయిందన్న వార్తలు వచ్చాయి. ఒక సీన్ విషయంలో ఇద్దరి మధ్య డిఫ్రెన్సెస్ రావడమే ఇందుకు కారణం అన్నారు. అలాగే మరో సినిమా విషయంలో కూడా జరిగిందని .. కొన్ని సాయి పల్లవి అసలు కాంప్రమైజ్ కాదని అంటారు. ప్రస్తుతం సాయి పల్లవి నాగ చైతన్య తో లవ్ స్టోరీ సినిమా చేసింది. సాయి పల్లవి కి ఫిదా లాంటి సూపర్ హిట్ ఇచ్చిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలని జరుపుకుంటుంది. ఈ సినిమా సాయి పల్లవికి మంచి హిట్ గా నిలుస్తుందని అంటున్నారు.
ఇక రానా దగ్గుబాటి తో విరాట పర్వం అన్న సినిమా చేస్తోంది. వేణు ఉడుగుల ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ప్రియమణి మరో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే నాని తో శ్యాం సింగ్ రాయ్ అన్న సినిమా చేస్తోంది. తాజా ఈ సినిమా ఓపెనింగ్ కాగా ఈ నెల 21 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలబోతోంది. అయితే సాయి పల్లవి టాలీవుడ్ లో ఇన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ కూడా కొందరిని భజన బ్యాచ్ అంటూ కామెంట్ చేసింది. మలయాళంలో సినిమాకి పని చేసే ప్రతీ ఒక్కరినీ సమానంగా చూస్తారని .. కానీ ఇక్కడ అలా ఉండదని బాగా డిఫ్రెన్స్ చూపిస్తారని ఇక్కడ ఎక్కువగా భజన చేసే వాళ్ళే అంటూ మాట్లాడింది. ఈ కామెంట్స్ తో సాయి పల్లవి నెటిజన్స్ కి దొరికిపోయిందని అంటున్నారు. మరి ఇమతకీ ఆ భజన బ్యాచ్ ఎవరో చెప్పలేదు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.