Sai Pallavi : ల‌వ్ లెట‌ర్ రాసిన సాయి ప‌ల్ల‌విని పిచ్చి కొట్టుడు కొట్టిన పేరెంట్స్

Authored By Sam C | The Telugu News | Published on: July 11, 2022, 2:00 pm

Sai Pallavi : సాయి ప‌ల్లవి.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చూడ చ‌క్క‌ని అందంతో పాటు ఆక‌ట్టుకునే అభిన‌యంతో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ‌. ఇటీవ‌ల విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దర్శకుడు వేణు ఉడుగులు తెరకెక్కించిన ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో సాయి పల్లవి పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉంది. ఆమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. అయితే విరాట పర్వం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో చేసిన కొన్ని కామెంట్స్ ఆమెను వివాదంలోకి నెట్టేశాయి. కాశ్మీర్ ఫైల్స్ చిత్రంలో కశ్మీరి పండితులకు జరిగిన అన్యాయాన్ని చూసి తాను తట్టుకోలేకపోయానని..

అలాగే ఆవులు తరలిస్తున్నారని కొందరు ముస్లింలపై దాడిని కూడా తాను చూడలేకపోయానని సాయి పల్లవి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దానిపై పెద్ద ర‌చ్చ న‌డిచింది. ఆ స‌మ‌యంలో సాయి ప‌ల్ల‌వి ప్ర‌త్యేక వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. దాంతో కొంత వ‌ర‌కు వివాదం స‌ద్దుమ‌ణిగింది. ఇక సాయి పల్లవి తాజాగా నటించిన చిత్రం ‘గార్గి’. త్రిభాష(తెలుగు, తమిళం, కన్నడ) చిత్రంగా రూపొందిన ఈ చిత్రం జులైన 15న విడుద‌ల కానుంది. గౌతమ్‌ రామచంద్రన్‌ దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇటీవల సాయి ప‌ల్ల‌వి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుద‌లైన ఫస్ట్‌లుక్ పోస్ట‌ర్‌, మేకింగ్ వీడియోల‌కు మంచి స్పందన వచ్చింది.

sai pallavi stunning comments on viral

sai pallavi stunning comments on viral

Sai Pallavi : అలా ఎలా?

ఈ చిత్రాన్ని త‌మిళంలో 2డీ ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌పై హీరో సూర్య, జ్యోతిక విడుద‌ల చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల కానుంది. ’96’ ఫేం గోవింద్ వ‌సంత్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ర‌విచంద్ర‌న్ రామ‌చంద్ర‌న్, ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ, థామ‌స్ జార్జ్ సంయుక్తంగా నిర్మించారు. చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో చాలా యాక్టివ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సాయి ప‌ల్ల‌వి తాజాగా ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. విరాట ప‌ర్వంలో ర‌వ‌న్న పాత్ర‌కు నువ్వు ల‌వ్ లెట‌ర్ రాశావు కదా, రియ‌ల్ లైఫ్‌లో ఎవ‌రికైనా ల‌వ్ లెట‌ర్ రాశావా అని గంగ‌వ్వ సాయి ప‌ల్ల‌విని ఓ ప్ర‌శ్న‌ అడిగింది. దానికి ఆమె మాట్లాడుతూ ‘‘నేను ఏడ‌వ త‌ర‌గ‌తిలో ఉన్న‌ప్పుడు ఓ అబ్బాయికి ల‌వ్ లెట‌ర్ రాశాను. ఆ లెట‌ర్‌ను నా పేరెంట్స్ చూశారు. న‌న్ను చాలా బాగా కొట్టారు’’ అని చెప్పింది. ఇప్పుడు ఇది వైర‌ల్‌గా మారింది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp