Home » Entertainment » Saif Ali Khan Photo Goes Viral Despite Joining Ntr 30 Movie Shoot
Entertainment

NTR 30 Movie : “NTR 30” మూవీ షూట్ లో జాయిన్ అయిన సైఫ్ అలీ ఖాన్ ఫోటో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: April 18, 2023, 1:57 pm
Advertisement

NTR 30 Movie : కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా. అంతకుముందు అల్ రెడీ “జనతా గ్యారేజ్” అనే సినిమా చేయడం జరిగింది. ఎన్టీఆర్ కెరియర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. అయితే ఇప్పుడు చేస్తున్న సినిమా ఎన్టీఆర్ కెరియర్ లో 30వ సినిమా కావటంతో… స్క్రిప్ట్ విషయంలో కొరటాల చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. పైగా “RRR”తో అంతర్జాతీయ స్థాయిలో తారక్ కి మంచి పేరు రావడంతో

Advertisement

Saif Ali Khan photo goes viral despite joining ntr 30 movie shoot

ఈ సినిమా కూడా ఆ తరహాలోనే తీయబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ జాహ్నవి కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూడా సినిమాలో కీలకపాత్ర పోషిస్తూ ఉన్నారు. ప్రారంభంలో ఓ బాలీవుడ్ హీరో కూడా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ సినిమా యూనిట్ నుండి ఎటువంటి ప్రకటన రాలేదు. లేటెస్ట్ గా కొరటాల శివ మరియు హీరో ఎన్టీఆర్ తో..

Advertisement

సినిమా సెట్స్ లో సైఫ్ అలీ ఖాన్ ఫోటో దిగటం జరిగింది. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. దీంతో “NTR 30” లో మనోడు పాత్ర ఉన్నట్లు కన్ఫామ్ అయ్యింది. ఈ పరిణామంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. మార్చి నెలలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమా రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ నీ చాలా పవర్ ఫుల్ రోల్ లో కొరటాల చూపించనున్నట్లు సమాచారం.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి