Samantha : స‌మంత పాట‌ని మెచ్చిన సల్మాన్ ఖాన్.. ఏకంగా సాంగ్ కూడా పాడేశాడుగా..

Authored By Sam C | The Telugu News | Published on: June 27, 2022, 4:30 pm

Samantha : స‌మంత మానియా ప్ర‌స్తుతం ఏ రేంజ్‌లో ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. క‌థానాయిక‌గానే కాకుండా స్పెష‌ల్ సాంగ్ లోను తెగ సంద‌డి చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. పుష్ప చిత్రం కోసం స‌మంత ఊ అంటావా మావ ఊఊ అంటావా అనేసింది. పుష్ప‌ సినిమాలో డైలాగ్స్‌, యాక్ష‌న్ స‌న్నివేశాలు, బ‌న్నీ మేన‌రిజ‌మ్ అన్నీ బాలీవుడ్ సెల‌బ్రిటీల‌నే కాదు.. ఇండియ‌న్ క్రికెట‌ర్స్‌ను సైతం ఆక‌ట్టుకున్నాయి. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత సార‌థ్యం వ‌హించిన పాట‌ల‌న్నీ హిట్టే. ముఖ్యంగా ఈ సినిమాలో స‌మంత న‌టించిన ఐటెమ్ సాంగ్ ‘ఊ అంటావా మావ..’ సాంగ్ ఓ ఊపు ఊపేసింది.

స‌మంత త‌న కెరీర్‌లో చేసిన తొలి ఐటెమ్ సాంగ్ అదే. రీసెంట్ టైమ్‌లో మీకు బాగా న‌చ్చిన సాంగ్ ఏదో చెప్పండి.. అని స‌ల్మాన్‌ని ప్ర‌శ్నించగా.. ఆయ‌న ఊ అంటావా మావ‌.. అంటూ హ‌మ్ చేస్తూ వెళ్లిపోయారు. ఇప్పుడా వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఆ మ‌ధ్య ర‌ణ్‌వీర్ సింగ్ కూడా ఈ సాంగ్‌ని ఎంత‌గానో ఇష్ట‌ప‌డ్డారు. త‌న ఫేవ‌రేట్ సాంగ్ అని చెప్పారు. స‌మంత విష‌యానికి వ‌స్తే.. ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. సమంత ఇటీవల నటించిన కన్మణి రాంబో ఖతీజా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రం ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీనితో సామ్ ఫ్యాన్స్ ఓ సాలిడ్ మూవీని ఆశిస్తున్నారు.

Salman Khan praised Samantha song

Salman Khan praised Samantha song

Samantha : స‌మంత పాట‌కి ఫిదా..

వారి అంచనాలకు తగ్గట్లుగా సమంత అదిరిపోయే ప్రాజెక్ట్స్ తో రాబోతోంది. సమంత నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ‘యశోద’. ఆగష్టులో ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హరి అండ్ హరీష్ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. ఆ మధ్యన విడుదలైన గ్లింప్ల్ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది. ఇది సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రం ఇది. థ్రిల్లింగ్ అంశాలతో ఉత్కంఠ భరితంగా సాగే సన్నివేశాలతో దర్శకులు తీర్చిదిద్దుతున్నారు. రావు రమేష్, సంపత్ రాజ్, మురళి శర్మ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Sam C

No bio available for this author.

  1. "Chandrababu : డిసెంబరులో ఏపీ కేబినెట్‌లో మార్పులు? పల్నాడు, రాయలసీమ కు కొత్త మంత్రులు!"

  2. "Home Loan Tips : బ్యాంకులు చెప్పని సీక్రెట్‌.. 20 ఏళ్ల హోమ్ లోన్‌ను త్వరగా తీర్చాలా? ఈ 5 స్మార్ట్ EMI పద్ధతులు పాటించండి..!"

  3. "AP Municipal Election Results : ఏపీ మున్సిపల్ ఫలితాలకు అంతా రెడీ.. ఉదయం 8 గంటల నుంచే లెక్కింపు..!"

  4. "Rising Stars Asia Cup 2026 : నవంబర్ 22న మ‌రోసారి భారత్-పాక్ బిగ్ ఫైట్.. తిలక్ వర్మకు కెప్టెన్సీ!"

  5. "Bigg Boss Telugu 10 : బిగ్‌బాస్‌లోకి రోహిత్ రీ ఎంట్రీ? వైరల్‌గా మారిన ఫోటోతో కొత్త ట్విస్ట్ !"

  6. "Flipkart Diwali Offer : డబుల్ డోర్ ఫ్రిజ్ ధరలోనే ట్రిపుల్ డోర్ ఫ్రిజ్.. రూ.21,990కే!"

  7. "Cyclone Murasu Schools Holiday : మురసు తుఫాను ఎఫెక్ట్.. ఏపీలో రేపు పాఠశాలలు, కాలేజీలకు సెలవులు!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp