Samantha : వెన‌క్కి త‌గ్గిన స‌మంత‌.. అక్కినేని ఫ్యాన్స్‌లో ఆనందం

Authored By Sam C | The Telugu News | Published on: August 25, 2022, 3:40 pm

Samantha: స‌మంత, నాగ చైత‌న్య వ్య‌వ‌హారానికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంటుంది. నాగచైతన్య ‌‌‌‌- సమంత నాగచైతన్యతో విడిపోయి పది నెలలు పైనే అవుతోంది… కాని ఇంకా ఏదో ఒక రకంగా ఏదో ఒక ఇష్యూలో వైరల్ న్యూస్ అవుతూనే ఉన్నారు ఇద్దరు. వీరి గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక న్యూస్ వింటూనే ఉన్నాము. ఒక విషయం మర్చిపోక ముందే.. మరోక విషయం హైలెట్ అవుతూ.. నెట్టింట హడావిడి జరుగుతుంది. ఇటీవ‌ల కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో స‌మంత నాగ చైత‌న్య గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. ” మా విడాకులు కూల్ గా జరగలేదు అంటూ బిగ్ బాంబ్ పేల్చిన సమంత. మా ఇద్దరిని ఒకే గదిలో పెడితే కచ్చితంగా పదునైనా ఆయుధాలు పెట్టాలంటూ హోస్ట్ కరణ్ కు స్పెషల్ రిక్వెస్ట్ చేసింది.

Samantha : కూల్ అండ్ కామ్..

ఈ ఒక్క మాటతో అక్కినేని అభిమానులు కోపంతో ఊగిపోయారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాకు సమంత చాలా దూరంగా ఉంటుంది . అయితే సమంత కావాలని సోషల్ మీడియాకు దూరంగా ఉంటుందంటూ ఓ వార్త బయటకు వచ్చింది . మ‌రో వైపు పుష్ప‌2లో కూడా స‌మంత ఎలాంటి ఐటెం సాంగ్ చేయ‌డం లేదట‌. ఫ్యూచ‌ర్‌లో మ‌ళ్లీ ఐటెం సాంగ్ చేయ‌న‌ని చెప్పింద‌ట‌. దీంతో స‌మంత ఫ్యాన్స్ తో పాటు అక్కినేని ఫ్యాన్స్ కూడా ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఎంతైన చైతూకి భార్య‌గా ఉన్న స‌మంత ఐటెం సాంగ్ చేయ‌డం వారిని కూడా బాధ‌పెట్టింది.

Samantha About Her Divorce With Naga Chaitanya

Samantha About Her Divorce With Naga Chaitanya

అక్కినేని కుటుంబం తెలుగు ఇండస్ట్రీలో పెద్ద కుటుంబం. టాలీవుడ్ లో అక్కినేని నాగేశ్వరావు వారసత్వాన్ని నాగార్జున నిలబెట్టారు.. ఆయన వారసత్వాన్ని నాగచైతన్య,అఖిల్ నిలబెడుతున్నారు. . సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత నాగ చైతన్య సినిమాల్లో చాలా బిజీగా ఉన్నారు. ఆయన నాగార్జున అంతా పేరు తెచ్చుకో లేకపోతున్నారు. ఇక నాగచైతన్య – సమంత విడాకులు తరువాత ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. అయితే నాగచైతన్యపై ప్రస్తుతం రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. యంగ్ హీరోయిన్ శోభితా దూళిపాలతో ఆయన డేటింగ్ లో ఉన్నారంటూ రూమర్స్ స్ర్పెడ్ అవుతున్నాయి. వీరు పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp