Home » Entertainment » Samantha About Secret Behind Her Fitness
Entertainment

Samantha: అందుకే జిమ్‌కు వెళ్లడం ప్రారంభించిదట.. ఇన్నాళ్లకు ఆ గుట్టు బయటపెట్టిన సమంత

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: January 26, 2021, 10:30 pm
Advertisement

Samantha: సమంత ఆ మధ్య అసలు ఫిట్ నెస్‌ మీద అంతగా దృష్టి పెట్టలేదు. కానీ పెళ్లి అయ్యాకే సమంతకు వాటిపై ఆసక్తి పెరిగింది. నాగ చైతన్య ఎప్పుడూ జిమ్‌లోనే గడుపుతూ ఉంటాడు. పైగా నాగార్జున, నాగ చైతన్యలు ఎప్పుడూ కూడా ఫిట్ నెస్‌లో పోటీ పడుతుంటారన్న సంగతి తెలిసిందే. అలా చైతన్యను పెళ్లి చేసుకున్న తరువాతే సామ్ కూడా ఎక్కువగా జిమ్ చేయడం మొదలుపెట్టేసింది.

Advertisement

Samantha about Secret Behind Her Fitness

నాగ చైతన్యకు ధీటుగా సమంత చేసే వర్కవుట్లు ఆ మధ్య ఎక్కువగా వైరల్ అయ్యాయి. ఏకంగా వంద కేజీల బరువు ఎత్తి అందరినీ ఆశ్చర్యపరిచింది. సమంతను చూసి అమల కూడా జిమ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా అక్కినేని ఫ్యామిలీ మొత్తం జిమ్‌లోనే రచ్చ చేసింది. అలా తనకు అంతలా ఫిట్ నెస్ మీదకు ఎందుకు శ్రద్ద పుట్టిందో అన్న విషయాన్ని ఇన్ని రోజులు బయటకు చెప్పలేదు సమంత.

Advertisement

కానీ తాజాగా ఆ గుట్టును విప్పింది. కాసేపటి క్రితమే సమంత తన అభిమానులతో కలిసి ముచ్చట్లు పెట్టింది. అందులో ఓ నెటిజన్.. తన ఫిట్‌నెస్‌కు స్ఫూర్తి ఎవరు అని అడిగారు. అలా సమంత అసలు విషయం చెప్పింది. అసలు సీక్రెట్ ఇప్పుడు చెబుతాను.. అసలు నేను చైతన్య ఏం చేస్తున్నాడు.. ఎప్పుడూ అక్కడే ఉంటాడు.. చైని చెక్ చెక్ చేసేందుకు అక్కడి వెళ్లేదాన్ని అంటూ అసలు గుట్టు విప్పింది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి