Samantha : అత‌ను చేసిన‌ పనికి.. సమంత రియాక్షన్ ఇదే..!

Authored By Cinema Desk | The Telugu News | Updated on: October 1, 2021, 11:17 am

Samantha సమంత ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. నాగ చైతన్య సమంత విడాకుల విషయంలో కొత్త కొత్త కథనాలు పుట్టుకొస్తున్నాయి. కానీ చై, సామ్ మాత్రం నోరు విప్పడం లేదు. ఏది కూడా క్లారిటీగా చెప్పడం లేదు. మొన్నటికి మొన్న ఓ నెటిజన్ సమంతను ఓ ప్రశ్న అడిగేశాడు. నిజంగానే ముంబైకి షిఫ్ట్ అవుతున్నారా? అంటూ అడిగేశాడు. దానికి సామ్ మంచి సమాధానమే ఇచ్చింది.

Samantha Akkineni on Drunken Man

Samantha Akkineni on Drunken Man

తాను ముంబైకి షిఫ్ట్ అవ్వడం లేదు అని, అది కేవలం రూమర్.. అలా వందల రూమర్లు వస్తున్నాయని అవేవీ నిజం కాదని సమంత చెప్పేసింది. అందులో సమంత చెప్పిన మాటలను బట్టి చూస్తే.. విడాకుల వ్యవహారం కూడా రూమర్ అని తెలుస్తోంది. కానీ నేరుగా ఆ పదాన్ని ఎందుకు ఉపయోగించలేదు? అనేది మరో అనుమానం. ఇలా ఎన్నెన్నో సందేహాలతో వీరి వ్యవహారం యూటర్న్‌లు తిరుగుతోంది.

samantha Akkineni Condemns Rumors On Shifting Mumbai

samantha Akkineni Condemns Rumors On Shifting Mumbai

పగలబడి నవ్విన సమంత.. Samantha

బయట జనాలు ఇంతలా మాట్లాడుకుంటూ ఉంటే.. సమంత మాత్రం తన ఫ్రెండ్స్‌తో కలిసి బాగానే ఎంజాయ్ చేస్తోంది. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తోంది. తాజాగా ఆమె ఓ తాగుబోతు చేసిన పనికి పగలబడి నవ్వేసింది. మిస్ అయినట్టు.. తనది తాను రిపోర్ట్ ఇచ్చుకున్నాడట ఓ తాగుబోత. ఆ సీన్ చూసి సమంత తెగ నవ్వేసుకుందట.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp