Samantha : కొత్త ఇంట్లోకి అడుగు పెడుతున్న నాగ చైతన్య .. సమంత కీ ఆ ఇంటికీ సంబంధం ఏంటో తెలుసా ?

Advertisement

Samantha : 2021.. అక్టోబర్ నెలలో సమంత నాగ చైతన్య విడిపోవడం తెలిసిందే. 2017లో వీరి వివాహం జరగక కేవలం నాలుగు సంవత్సరాల తర్వాత… మనస్పర్ధలు వచ్చి ఎవరికి వారు విడిపోవడం జరిగింది. అసలు వీరిద్దరూ ఎందుకు విడిపోయారు అన్నది ఎవరికీ అర్థం కాదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చూడముచ్చట జంటగా కనిపించే ఈ ఇద్దరు విడిపోవడం చాలామందికి బాధ కలిగించింది. పరిస్థితి ఇలా ఉంటే సమంతాతో పెళ్లయిన కొత్తలో ఇద్దరు… మురళీమోహన్ కి సంబంధించిన ఒక పెద్ద భవనాన్ని ఇష్టపడటం జరిగింది. అయితే ఆ భవనం అమ్మదలుచుకోలేదని మురళీమోహన్ చెప్పటంతో సమంత నాగచైతన్య ఎలాగైనా ఆ ఫ్లాట్ కొనాలని, అందుట్లో నివసించాలని.. భవిష్యత్తు ప్రణాళిక వేసుకున్నారు. ఈ క్రమంలో తండ్రి నాగార్జున చేత రికమెండ్ చేయించి మురళీమోహన్…

Samantha and Naga Chaitanya is stepping into a new house
Samantha and Naga Chaitanya is stepping into a new house

భవనాన్ని అమ్మేలా దాని చేజిక్కించుకునేలా వ్యవహరించడం జరిగింది. ఆ భవనంలో సెపరేట్ జిమ్ముతోపాటు గార్డెన్, లైబ్రరీ, స్విమ్మింగ్ పూల్.. థియేటర్ అన్ని రంగులతో ఉండటంతో కొద్దిగా డిజైన్ మార్చడానికి ఇద్దరు రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఇంటి నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో సమంత నాగచైతన్య మధ్య మనస్పర్ధలు రావడం ఇద్దరు ఎవరికివారు విడిపోవడం జరిగింది. ఆ తర్వాత సమంత కెరియర్ పరంగా బిజీ అయ్యింది. నాగచైతన్య కూడా సినిమాలు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు సమంత ఆ భవనాన్ని పూర్తిగా గతంలో అమ్మిన ధర కంటే అధిక మొత్తం చెల్లించి.. అక్కడే నివసిస్తున్నారట. హైదరాబాదులో సమంత అక్కడే ఉంటుందట. పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల నాగచైతన్య కొత్త ఇంటిని కొనుక్కోవడం జరిగిందంట.

Advertisement
Samantha and Naga Chaitanya is stepping into a new house
Samantha and Naga Chaitanya is stepping into a new house

వాస్తవానికి సమంత ప్రస్తుతం ఉంటున్న భవనానికి నాగచైతన్య కూడా డబ్బులు అప్పట్లో చెల్లించినట్లు టాక్. అయితే ఆ డబ్బును వదిలేసుకుని ఇప్పుడు పూర్తిగా వేరే కొత్త ఇంటిలో చైతు ఒంటరిగా ఉండటానికీ రెడీ అయినట్లు సమాచారం. సమంత “ఖుషి” ఇంకా బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు వెబ్ సిరీస్ సినిమాలు చేస్తూ ఉంది. ఇటీవల అనారోగ్యం నుండి కోలుకోవడంతో మెల్లమెల్లగా షూటింగ్ లలో బిజీగా గడుపుతోంది. ఇక నాగచైతన్య “కస్టడీ”తో వేసవికాలంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాస్తవానికి నాగచైతన్య కొనుక్కున్న ఇల్లు ముందుగా సమంత కొనాలని భావించిందట. అయితే నాగచైతన్య కొంటున్నట్లు.. తెలుసుకోవడంతో అంతకుముందు చైత్తోతో కలిసి ఉన్న భవనాన్ని సమంత కొనుగోలు చేసి ఇంకా అక్కడ సెటిలైపోయినట్టు టాక్ నడుస్తోంది.

Advertisement
Advertisement