Home » Entertainment » Samantha And Sadhna Singh Conversation
Entertainment

Samantha : అలాంటి పనులు చేస్తుందా?.. సమంతపై ఆరోపణలు

Authored By
Cinema Desk
The Telugu News | Published on: September 22, 2021, 7:55 pm
Advertisement

Samantha సమంత Samantha ప్రస్తుతం వార్తల్లో ట్రెండ్ అవుతూ ఉంటోంది. గత కొన్ని రోజులుగా సమంత విడాకుల వ్యవహారంపై లెక్కలేనన్ని వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ నాగ చైతన్య గానీ, సమంత గానీ వాటిపై స్పందించడం లేదు. విడాకుల రూమర్లను కొట్టిపారేయడం లేదు. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే మాత్రం ఆ ఇద్దరి మధ్య వ్యవహారం చెడినట్టు కనిపిస్తోంది. త్వరలోనే ఈ ఇద్దరూ విడాకులు కూడా తీసుకోబోతోన్నట్టు సమాచారం అందుతోంది. అందుకే మీడియా మీద కూడా సమంత కస్సుమంది.

Advertisement

Samantha And Sadhna Singh Conversation

సమంత చేష్టలపై కామెంట్స్.. Samantha

తిరుమలలో దర్శనం అనంతరం సమంతను రూమర్ల మీద స్పందించమని అక్కడి మీడియా అడిగితే.. బుద్ది ఉందా? అని అసహనం వ్యక్తం చేసింది. అలా సమంత మరోసారి హాట్ టాపిక్ అయింది. కానీ సమంత మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. మీడియా, సోషల్ మీడియాలో వచ్చే వార్తలను అస్సలు పట్టించుకోవడం లేదు. తన ఫ్రెండ్స్, గ్యాంగ్‌తో కలిసి పార్టీలు చేసుకుంటోంది. త్రిష, కీర్తి సురేష్ ఇలాంటి హీరోయిన్లతో కలిసి రచ్చ చేస్తోంది.

Advertisement

nagachaitanya responding soon to the divorce with Samantha

ఇక తన మేకప్ ఆర్టిస్ట్ సాధన సింగ్‌తో సమంత మరింత సన్నిహితంగా ఉంటోంది. జిమ్‌కు వచ్చి తనను వర్కవుట్లు చేయకుండా డిస్టర్బ్ చేస్తోందని సాధన సింగ్ గురించి సమంత చెప్పింది. అయితే ఇప్పుడు సాధన సింగ్ మాత్రం సమంత మీద ఆరోపణలు చేసింది. ఎవరైనా ఫోటో చూడమని ఫోన్ ఇస్తే.. అదొక్కటే చూసి తిరిగి ఇవ్వాలి. అంతేకానీ దాని ముందు వెనకా ఉన్న ఫోటోలను చూడకూడదు.. సమంత మాత్రం అలా చేస్తుంటుంది అని చెప్పేసింది. దానికి సమంత మాత్రం పగలబడి నవ్వినట్టు ఎమోజీలను షేర్ చేసింది. అంటే సమంతకు ఫోటో చూడమని ఫోన్ ఇస్తే.. అన్నింటిని వెదుకుతుందన్న మాట.

Advertisement

 

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి