Samantha : వద్దు వద్దు అని తల్లి బతిమాలుతున్నా మళ్ళీ ‘ అదే ‘ పని .. సమంత… ఇక మారావా ??

 Authored By prabhas | The Telugu News | Updated on :23 January 2023,2:20 pm

Samantha : తెలుగులో నెంబర్ వన్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది సమంత. నాగచైతన్య తో విడాకులు తీసుకున్నాక తనదృష్టి అంతా సినిమాల పైన పెట్టింది. ఎవరు ఊహించిన విధంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ఇటీవల మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత ఇప్పుడిప్పుడే ఆవ్యాధి నుంచి కోలుకుంటుంది. రీసెంట్గా శాకుంతలం సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో పాల్గొంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ సినిమా ఫిబ్రవరి 17న గ్రాండ్గా విడుదల కాబోతుంది.

ఇటీవలే సమంత బాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టింది. హిందీలో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొంటుంది. దీనికి సంబంధించిన ఫోటోలు మేకర్స్ ఇటీవల విడుదల చేశారు.బాలీవుడ్ లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ లల్లో ఇది ఒకటి. ఇందులో సమంత కీలక పాత్ర పోషిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ దావనచ కూడా మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు ఈ వెబ్ సిరీస్ సమంతకు మంచి పేరు తీసుకొస్తుందని తెలుస్తుంది.

Samantha back to back act in movies

Samantha back to back act in movies

అయితే మయో సైటీస్ వ్యాధితో బాధపడుతున్న సమంత ఏ మాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేస్తుంది. ఆమె తల్లి వద్దని చెబుతున్న సమంత ఏమాత్రం వినకుండా షూటింగ్లలో పాల్గొంటుంది. సమంత విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి సినిమా షూటింగ్లో పాల్గొంటుంది. శాకుంతలం సినిమాలో సమంత శకుంతల పాత్ర పోషిస్తుంది. మలయాళ నటుడు దేవ్ మోహన్, దుష్యంతుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ పరంగా సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి