Samantha : స‌మంత బాలీవుడ్ ప్రాజెక్ట్ ఎప్పుడు మొద‌లు కానుందో తెలుసా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : స‌మంత బాలీవుడ్ ప్రాజెక్ట్ ఎప్పుడు మొద‌లు కానుందో తెలుసా

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌లి కాలంలో తెగ వార్త‌ల‌లో నిలుస్తుంది. నాగ చైత‌న్య నుండి విడిపోయిన త‌ర్వాత సామ్ కేవ‌లం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లు కూడా చేస్తూ అల‌రిస్తుంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్ సిరీస్‌ సెకండ్‌ సీజన్‌ తర్వాత సమంత క్రేజ్‌ బాలీవుడ్‌లోనూ బాగా పెరిగింది. అయితే ఆ వెబ్‌సిరీస్‌ తర్వాత ఇప్పటి వరకు సమంత మరో బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌కి అధికారికంగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు. కానీ ‘ది ఫ్యామిలీ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :24 March 2022,6:30 pm

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌లి కాలంలో తెగ వార్త‌ల‌లో నిలుస్తుంది. నాగ చైత‌న్య నుండి విడిపోయిన త‌ర్వాత సామ్ కేవ‌లం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లు కూడా చేస్తూ అల‌రిస్తుంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్ సిరీస్‌ సెకండ్‌ సీజన్‌ తర్వాత సమంత క్రేజ్‌ బాలీవుడ్‌లోనూ బాగా పెరిగింది. అయితే ఆ వెబ్‌సిరీస్‌ తర్వాత ఇప్పటి వరకు సమంత మరో బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌కి అధికారికంగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు. కానీ ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’తీసిన రాజ్‌ అండ్‌ డీకే ద్వయం రూపొందించనున్న మరో వెబ్‌ సిరీస్‌లో సమంత భాగం కానున్నారని, ఈ ప్రాజెక్ట్‌లో వరుణ్‌ ధావన్‌ మెయిన్‌ లీడ్‌గా చేస్తారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. ఈ విష‌యంపై ఇటీవ‌ల క్లారిటీ కూడా వ‌చ్చింది.

బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి తొలిసారి సమంత నటించబోతోంది. హాలీవుడ్ సిరీస్ సిటడెల్కు ఇండియన్ వెర్షన్ లో ఈ ఇద్దరు స్టార్లు జట్టుకట్టబోతున్నారు. ఈ ప్రాజక్ట్ కే సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన చర్చల కోసం ఇటీవ‌ల భేటి అయ్యారు. మీటింగ్ అయిపోయిన తరువాత సమంత బయటకు వెళ్లిపోతున్న సందర్భంలో అంతా హడావిడి అయిపోయింది. ఫొటో జర్నలిస్టులు అంతా ఆమె చూటు చేరి ఫొటోల కోసం ప్రయత్నించారు. దీంతో హీరో వరుణ్ ధావన్.. ఆమెను ఒక భౌన్సర్ లా కాపాడాడు. సమంతకు ఎస్కార్ట్ లాగా కారు దాకా వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Samantha bollywood project stars soon

Samantha bollywood project stars soon

Samantha : స‌మంత స్పీడ్ మాములుగా లేదుగా..

సిటాడెల్ సినిమాకు సంబంధించి బాలీవుడ్ మీడియా వెల్లడించిన ప్రకారం.. ఈ చిత్రం జూలై ముంబైలో ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత విదేశాల్లో నిర్విరామంగా షూటింగ్ జరుపుకొంటుంది. యూరప్‌, ఇతర దేశాల్లో ఈ సినిమాను షూట్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేశారు. త్వరలోనే లోకేషన్ల ఎంపికను పూర్తి చేసి షూటింగ్‌ చేపడుతారు అని పేర్కొన్నారు. సిటాడెల్ చిత్రంలో వరుణ్ ధావన్‌కు హై ఓల్టేజ్ యాక్షన్ సీన్లు ఉంటాయి. ఈ యాక్షన్ ఎపిసోడ్స్‌లో మార్షల్ ఆర్ట్స్ ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది