Samantha : వాళ్ళ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సమంత .. వాళ్లకి రాడ్ దింపింది గా !

 Authored By prabhas | The Telugu News | Updated on :3 April 2023,10:00 am

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత త్వరలోనే ‘ శాకుంతలం ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమా ఏప్రిల్ 14 న థియేటర్స్ లలో విడుదల కానుంది. గుణశేఖర్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సమంత ఈ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్గా పాల్గొంటుంది. తాజాగా శాకుంతలం స్పెషల్ చిట్ చాట్ లో భాగంగా ఆమె మలయాళ నటుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Samantha comments about malayalam actors

Samantha comments about malayalam actors

సామ్ మాట్లాడుతూ తనకు నటన మీద డౌట్ వచ్చిన ప్రతిసారి మలయాళ సినిమాలను చూస్తానని చెప్పారు. సూపర్ డీలక్స్ సినిమాలో ఫాహాద్ ఫజిల్ నటన తనకు చాలా ఇష్టమని ప్రతి మలయాల నటులు అద్భుతంగా నటిస్తారు అని అన్నారు. వారితో మళ్ళీ మళ్ళీ పనిచేయాలని అనిపిస్తుందని తెలిపారు. శాకుంతలం సినిమా కథ విన్నప్పటి నుంచి సినిమా చేసేందుకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. గుణశేఖర్ గారు చాలా గొప్పగా చేశారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని సమంత చెప్పుకొచ్చారు. ఇక సమంత బాలీవుడ్ లో కూడా శాకుంతలం సినిమాను భారీగా ప్రమోట్ చేస్తుంది.

samantha emotional interaction with anchor suma

samantha emotional interaction with anchor suma

అక్కడ అంతకుముందే ఫ్యామిలీ మెన్ టు వెబ్ సిరీస్ లో నటించింది. ఇక పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ తో మంచి గుర్తింపుని తెచ్చుకుంది ఇప్పుడు శాకుంతలం సినిమాతో మరోసారి బాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. శాకుంతలం లాంటి సినిమాలు ప్రతి నటికి లైఫ్ లో ఒక్కసారి వచ్చే ఛాన్స్ అని ఈ సినిమా చేయకపోతే తను చాలా మిస్ అయ్యే దాన్ని అంటున్నారు సమంత. ఇక సమంత ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఎప్పుడో విడుదలైంది. ఈ పోస్టర్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి