Samantha : న‌న్ను నాగ చైతన్య‌ని ఒకే గ‌దిలో పెడితే ఏమవుతుందో తెలుసా అంటూ స‌మంత షాకింగ్ కామెంట్స్..!

Authored By Sam C | The Telugu News | Published on: July 22, 2022, 12:30 pm

Samantha : అక్టోబ‌ర్ 2న నాగ చైతన్య‌, స‌మంత విడాకులు తీసుకున్న విష‌యం తెలిసిందే. బ్రేక‌ప్ త‌ర్వాత స‌మంత మాత్ర‌మే త‌మ మ‌ధ్య జ‌రిగిన విష‌యాల గురించి ప్ర‌స్తావిస్తుంది త‌ప్ప చైతూ ఏ మాత్రం స్పందించ‌డం లేదు. చైతూ ఈ విషయంపై మళ్లీ మాట్లాడటానికి సిద్ధంగా లేదని ‘థాంక్యూ’ ప్రమోషన్స్ లో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలను అవైడ్ చేయడాన్ని బట్టి అర్థం అవుతుంది. అయితే సామ్ గురించి తెలిసినవాళ్ళు మాత్రం కచ్చితంగా ఆమె ఈ ఇష్యూ మీద సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడుతుందని భావించారు. నాగ చైతన్య పేరు తీసుకురాకుండానే ‘కాఫీ విత్ కరణ్’ 7వ సీజన్ మూడవ ఎపిసోడ్ లో సమంత తన విడాకుల గురించి మరియు విడిపోయిన తర్వాత జీవితం గురించి సమాధానమిచ్చింది.

‘నువ్వు నీ హస్బెండ్ విడిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత..’ అని కరణ్ జోహార్ అడుగుతుండగా.. సామ్ మధ్యలో కలుగజేసుకొని ‘ఎక్స్ హస్బెండ్’ అని సూచించింది. ఆ సందర్భంలో సమంత దగ్గినట్లు గొంతు సవరించుకోవడాన్ని గమనించవచ్చు. దీంతో కరణ్ సారీ చెబుతూ ప్రశ్నను కంటిన్యూ చేశారు. సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు ఎక్కువగా ఉంచారు? దాని వల్లే మీపై ఎక్కువ ట్రోలింగ్ జరిగిందని అనుకుంటున్నావా? అని ఆమెను అడిగాడు. ప్రేక్షకులు ఎల్లప్పుడూ తన జీవితంలో భాగమే కాబట్టి.. తాను పబ్లిక్ డొమైన్ లో ఆ విషయాన్ని ఉంచానని సామ్ బదులిచ్చింది.

samantha comments about Naga Chaitanya

samantha comments about Naga Chaitanya

Samantha : అలా అనేసింది ఏంటి?

పారదర్శకంగా ఉండాలని ఆ మార్గాన్ని ఎంచుకున్నానని తెలిపింది. మీ ఇద్దరి మధ్య ఏమైనా హార్డ్ ఫీలింగ్స్ ఉన్నాయా అని కరణ్.. సమంతను మరో ప్రశ్న వేశాడు. దీనికి సమంత షాకింగ్ సమాధానం ఇచ్చింది. మీరు నన్ను నాగచైతన్యను ఒకే గదిలో వేసినట్లయితే.. ఆ గదిలో పదునైన వస్తువులు ఏవీ లేకుండా చూసుకోవాలి అని కరణ్‌కు సమాధానం చెప్పింది. ప్రస్తుతం… తనకు చైకు మధ్య పరిస్థితులు అలాగే ఉన్నాయని.. భవిష్యత్తులో అవి మారవచ్చు అని సమంత పేర్కొంది. ఇక సమంత తనను ఎక్కువగా వ్యక్తిగత ప్రశ్నలు వేయొద్దంటూ కరణ్ జోహార్‌ను కోరింది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp