Samantha : సైజ్ మరీ తగ్గించేస్తోన్న సమంత.. విష్ణుప్రియ కామెంట్లు వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : సైజ్ మరీ తగ్గించేస్తోన్న సమంత.. విష్ణుప్రియ కామెంట్లు వైరల్

 Authored By prabhas | The Telugu News | Updated on :1 April 2022,7:00 pm

Samantha : సమంత ఈ మధ్య చేస్తోన్న అందాల ఆరబోత గురించి అందరికీ తెలిసిందే. ఈ మధ్య రాను రాను పొట్టి పొట్టి బట్టలు వేస్తోంది. బట్టల సైజును తగ్గించేస్తోంది. ఇక ఇప్పుడు బికినీలాంటి డ్రెస్సును ధరించేసింది. మొన్నటికి మొన్న క్లీవేజ్ షోతో కాకరేపేసింది. ఆ డ్రెస్సింగ్ మీద విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అలా తన మీద వచ్చిన విమర్శలపై సమంత సెటైర్లు వేసింది.మనం 2022లో ఉన్నాం అయినా కూడా వస్త్రాలను ఆధారంగా చేసుకుని మహిళ వ్యక్తిత్వాన్ని నిర్ణయించేస్తున్నాం..

ఇక మనం ఎప్పుడు మారతాం అన్నట్టుగా సమంత చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి సమంత రెచ్చిపోయింది. తన బట్టలు, అందులోని అందాల ప్రదర్శన చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.కాస్మో ఇండియా అనే మేగజైన్ సంస్థ సమంత కవర్ ఫోటోను వేసింది. సమంత గురించి గొప్పగా చెప్పుకొచ్చింది. కమర్షియల్ సక్సెస్‌లు, విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటోందని, ఎంతో టాలెంట్ ఉన్న నటి అని తెలిపింది.

Samantha Cosmo India Cover Pics

Samantha Cosmo India Cover Pics

Samantha : సమంత అందాల ఆరబోత..

మొత్తానికి ఈ కవర్ ఫోటోలో సమంత మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. రెండు ముక్కల దుస్తులను ధరించింది.అయితే సమంత అందాల ఆరబోతకు నెటిజన్లు అవాక్కవుతున్నారు. కొందరు నెటిజన్లు సమంతను విమర్శిస్తుంటే.. విష్ణుప్రియ లాంటి సెలెబ్రిటీలు మాత్రం సమంత ఎక్స్‌పోజింగ్ చూసి ఫిదా అవుతున్నారు. ఎంతో హాటుగా ఉన్నావ్.. నువ్ ప్రతీ విషయంలో ఓ డైమండ్ లాంటిది దానివి అంటూ ఫైర్ ఎమోజీలను విష్ణుప్రియ షేర్ చేసింది.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది