Samantha : వామ్మో… స‌మంత ఇంత‌లా ఇంత‌లా అందాలు ఆర‌బోయ‌టానికి కార‌ణం ఏంట‌బ్బా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :19 June 2022,7:00 pm

Samantha : టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ ఫిమేల్ కేటగిరీలో సమంత తనకు ఎవరూ పోటీలేరని మళ్ళీ మళ్ళీ నిరూపించుకుంటోంది. ప్రతి నెల లాగే మే నెలలో కూడా మొదటి స్థానాన్ని సమంత నిలబెట్టుకుంది. పుష్ప అనే సినిమాలో ఐటెం సాంగ్ కి డ్యాన్స్ వేసిన ఆమె దేశం మొత్తం ఒక ఊపు ఊపింది. చివరిగా నయనతారతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆమె తెలుగులో శాకుంతలం, యశోద సినిమాల్లో నటిస్తోంది. ఇవి కాక మరిన్ని సినిమాలు కూడా ప్రకటించారు. స‌మంత ఒకవైపు సినిమాల ద్వారానే కాక సోష‌ల్ మీడియా ద్వారా తెగ సంద‌డి చేస్తుంది. తాజాగా కేక పెట్టించే అందాల‌తో కైపెక్కిస్తూ మెంట‌లెక్కిస్తుంది.

ప్ర‌స్తుతం స‌మంత బ్యూటీఫుల్ పిక్స్ నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. స‌మంత జోరు మాములుగా లేదు.. ఏమాయ చేశావే’ చిత్రంతో అరంగ్రేటం చేసి మొద‌టి సినిమాతోనే తెలుగు ప్రేక్ష‌కుల‌ను మాయ‌ చేసింది. అన‌తికాలంలోనే స్టార్ హీరోలంద‌రితో క‌లిసి సినిమాలు చేస్తూ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో ఘాటైన ఫోటోల‌ను పోస్ట్ చేస్తూ యూత్‌ను ఆక‌ర్షిస్తుంటుంది. స‌మంత ఇన్‌స్టాగ్రామ్‌లో చురుకుగా పాల్గొంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు ఫోటోల‌ను షేర్ చేస్తూ అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటుంది.

samantha cute looks on twitter

samantha cute looks on twitter

అంతేకాకుండా బ్రాండ్‌లను కూడా ప్ర‌మోట్ చేస్తుంది. అయితే ఈమె బ్రాండ్‌ల‌ను ప్ర‌మోట్ చేయ‌డం ద్వారా ఎంత సంపాదిస్తుంది అనే ప్ర‌శ్న అందరి మ‌దిలో మెదులుతూ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సమంతకు ప్ర‌స్తుతం 24 మిలియ‌న్ల్ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. కాగా స‌మంత ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రాండ్‌ల‌ను ప్ర‌మోట్ చేయ‌డం ద్వారా నెల‌కు దాదాపు రూ.2 కోట్ల వ‌ర‌కు సంపాదిస్తుంద‌ట‌. ఇక సామ్ ప్ర‌తి సినిమాకు 3.5కోట్ల నుంచి 4కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్‌ను అందుకుంటుంది. ప్రస్తుతం స‌మంత ఏడాదికి మూడు నుంచి నాలుగు సినిమాల‌ను చేస్తుంది. ఈ లెక్క‌న చూసుకుంటే సినిమాల‌తో కంటే సోష‌ల్ మీడియా ద్వారానే సామ్ ఎక్కువ‌గా సంపాదిస్తుంది.

sandeep

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి