Samantha : డోసు పెంచిన స‌మంత‌.. మెస్మరైజింగ్ లుక్స్ షేర్ చేసిన ముద్దుగుమ్మ‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : డోసు పెంచిన స‌మంత‌.. మెస్మరైజింగ్ లుక్స్ షేర్ చేసిన ముద్దుగుమ్మ‌

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో స‌మంత ఒక‌రు. ఈ అందాల ముద్దుగుమ్మ సినిమాల‌తో పాటు సోష‌ల్ మీడియాలోను ర‌చ్చ చేస్తుంటుంది. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తెలుగు, తమిళ సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. చెన్నై, ముంబై, హైదరాబాద్‌ల మధ్య ప్రయాణిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. సమంత తాజాగా `ఫ్యామిలీమేన్-2` రూపకర్తలు రాజ్, డీకే‌లను కలిసింది. బాలీవుడ్ కథానాయకుడు […]

 Authored By sandeep | The Telugu News | Updated on :17 March 2022,6:30 pm

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో స‌మంత ఒక‌రు. ఈ అందాల ముద్దుగుమ్మ సినిమాల‌తో పాటు సోష‌ల్ మీడియాలోను ర‌చ్చ చేస్తుంటుంది. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తెలుగు, తమిళ సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. చెన్నై, ముంబై, హైదరాబాద్‌ల మధ్య ప్రయాణిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. సమంత తాజాగా `ఫ్యామిలీమేన్-2` రూపకర్తలు రాజ్, డీకే‌లను కలిసింది. బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్‌తో వీరు ఓ వెబ్ సిరీస్ చేయబోతున్న సంగతి తెలిసిందే.
స‌మంత మెస్మ‌రైజింగ్ షో

ఈ నేపథ్యంలో ఈ ముగ్గురినీ సమంత కలవడం చర్చనీయాంశంగా మారింది. రాజ్, డీకే‌ రూపొందించిన `ఫ్యామిలీమేన్-2` వెబ్ సిరీస్ సమంతకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. ఒకరకంగా సమంత బాలీవుడ్ బాటలకు ఈ వెబ్‌సిరీసే మార్గంవేసిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రాజ్, డీకే రూపొందించే మరో వెబ్ సిరీస్‌లో సమంత నటించనున్నట్టు తెలుస్తోంది.ఇటీవ‌ల సమంత రాజ్, డీకేలను కలిశారు. మీటింగ్ అనంతరం ఇద్దరూ బయటకు రాగానే ఫొటోగ్రాఫర్లు, అభిమానులు వారిని చుట్టుముట్టారు.ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. గట్టిగా కేకలు వేశారు. దీంతో సమంత భయపడిపోయింది.

samantha cute looks viral

samantha cute looks viral

పక్కనే ఉన్న వరుణ్ ఆమెను ఫొటోగ్రాఫర్ల నుంచి తప్పించాడు. `సమంతను ఎందుకు భయపెడుతున్నారు` అంటూ ఆమెను పక్కకు తీసుకెళ్లి కారు ఎక్కించాడు. ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అయింది. అయితే స‌మంత ఇటీవ‌ల ఓ యాడ్‌లో అందాల ఆర‌బోత‌తో రచ్చ చేసింది. మెస్మ‌రైజింగ్ లుక్స్‌తో కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. క్యూటీ భామ అంద‌మైన పిక్స్ నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఈ పిక్స్‌కి నెటిజ‌న్స్ స్ట‌న్నింగ్ కామెంట్స్ పెడుతున్నారు.స‌మంత న‌టించిన శాకుంత‌లం విడుద‌లకి సిద్ధం కాగా, య‌శోద సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. మ‌రోవైపు స‌మంత త‌మిళం, హిందీ భాష‌ల‌కు చెందిన సినిమాల‌తో బిజీగా ఉంది. వీటి కోసం ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది