Samantha : చిరంజీవితో ఢీ అంటున్న స‌మంత‌.. అంత డేర్ ఎక్క‌డిది?

Authored By Sam C | The Telugu News | Updated on : 24 April 2022, 10:00 pm

Samantha : మెగాస్టార్ చిరంజీవికి ఇప్ప‌టికీ ఇండ‌స్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.ఆయ‌న సినిమా విడుద‌ల అవుతుంది అంటే అభిమానులు క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన తాజా చిత్రం ఆచార్య‌. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇంతకు ముందు ఈ తండ్రీకొడుకులు ఒకరి సినిమాలో మరొకరు గెస్ట్ రోల్స్ చేశారు. కానీ ఈ సారి మాత్రం పూర్తి స్థాయి పాత్రలతో మెగా అభిమానులను సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమయ్యారు. గత ఏడాది చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఏప్రిల్ 29న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టిన ఆచార్య టీమ్..

నిన్న హైదరాబాదులోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ప్ర‌స్తుతం ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ సాగుతున్నాయి.సందేశాత్మక కథకు మాస్ కమర్షియల్ అంశాలన్నీ జోడించి కొరటాల ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తే.. రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే చేసింది. సోనుసూద్ తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రలను పోషించగా.. క్రేజీ హీరోయిన్ రెజీనా ఇందులో స్పెషల్ సాంగ్ చేసింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ మెగా మల్టీస్టారర్ కి సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.రాంబో (విజయ్ సేతుపతి) ఖతీజా (సమంత రూత్ ప్రభు), కన్మణి (నయనతార) మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిన చిత్రం ‘కాతు వాకుల రెండు కాదల్’.

samantha daring step 

samantha daring step

Samantha : డేరింగ్ స్టెప్..

తెలుగులో ఈ మూవీ “కన్మణి రాంబో ఖతీజా”గా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీని అందించారు. కాగా ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. మేకర్స్ ఈ విషయాన్ని ప్రకటించినప్పటి నుంచి హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇది డేరింగ్ స్టెప్ అని చెప్పాలి. ఆ మరుసటి రోజు అంటే 29న ‘ఆచార్య’ భారీ ఎత్తున విడుదలకు సిద్ధం అవుతోంది. మరి తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ సినిమాల హవా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ‘ఆచార్య’తో ‘కాతు వాకుల రెండు కాదల్’ మూవీ ఢీకొంటుందా? అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది..

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి